Ads
కామెడీ స్కిట్స్ షో గా జబర్దస్త్ ఎంత పాపులర్ అయిందో కొత్త గా చెప్పక్కర్లేదు. ఇందులో వచ్చిన కమెడియన్లు కూడా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నారు. కొందరైతే ఏకం గా సినిమాల్లో కూడా నటించే అవకాశాలను పొందారు. వారిలో హైపర్ ఆది ముందున్నాడు. సుడిగాలి సుధీర్, గెట్ అప్ శీను, ఆటో రామ్ ప్రసాద్.. ఇలా వీరంతా జబర్దస్త్ ద్వారానే ఫేమస్ అయ్యారు. తాజాగా వీరి జాబితాలో ఇమ్మాన్యుయేల్ కూడా చేరనున్నారు.
Video Advertisement
ఇమ్మాన్యుయేల్ కూడా కామెడీ డోస్ పెంచాడు. ఇతని జోరు చుస్తే టీం లీడర్ అవ్వడమే లక్ష్యం గా పెట్టుకున్నట్లు ఉన్నాడు. ఇమ్మాన్యుయేల్ తో పాటు ఓ లేడీ కూడా ఆక్ట్ చేస్తోంది. సీరియల్స్ బ్యూటీ వర్ష ఇమ్మాన్యుయేల్ కి జంటగా కనబడుతోంది. చాలా స్కిట్ లను వీరిద్దరూ కలిసి పండిస్తున్నారు. జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ తక్కువే అన్న సంగతి తెలిసిందే. చాలా మంది జెంట్స్ లేడీ గెట్ అప్స్ తో ఫేమస్ అయిపోయారు. వినోదిని, తన్మయి, శాంతి స్వరూప్ ఇలా వీరందరూ లేడీ గెట్ అప్స్ తోనే పాపులర్ అయ్యారు. వీరితో పాటు, సాయి లేఖ గా పరిచయం అయిన సాయి కూడా ఇపుడు బాగా ఫేమస్ అవుతున్నాడు.
అయితే, ఈ జబర్దస్త్ లేడీ ఇమ్మాన్యుయేల్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. తాను ఎక్కువ స్కిట్ లలో ఇమ్మానుయేల్ కి జోడి గా నటించానని… కాబట్టి తానె ఇమ్మాన్యుయేల్ కి పెళ్ళాన్ని అంటూ సరదాగా కామెంట్ లు చేసాడు. మీరు భార్య అయితే.. మరి వర్ష ఏంటి..? అని ప్రశ్నించగా వర్ష రెండో పెళ్ళాం అంటూ ఫన్నీ జోక్ ని పేల్చారు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావ్ అంటే.. ఇప్పుడే కాదు అని సమాధానం ఇచ్చాడు. అబ్బాయినా..? అమ్మాయినా..? అని యాంకర్ మరో చిలిపి ప్రశ్న అడిగితె.. సాయి లేఖ గా అయితే అబ్బాయిని.. సాయి గా అయితే అమ్మాయిని అని సరదాగా చెప్పుకొచ్చాడు.
watch video:
End of Article