Ads
తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు సంపాదించుకున్న నటి సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో సాయి పల్లవి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే సాయి పల్లవి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత తెలుగుతో పాటు తమిళం మలయాళం సినిమాల్లో కూడా నటించారు.
Video Advertisement
నటించినవి కొన్ని సినిమాలే అయినా..అందరికీ భిన్నంగా, తన స్వభావానికి దగ్గరగా ఉండే సినిమాలు తియ్యడం సాయి పల్లవి నైజం. నటనలోనూ, నాట్యం లోనూ , పెద్ద హీరోలతో పోలిస్తే దేనికి తీసిపోదు. తను ఎంచుకునే కథలతోనే అందరి మనసులు దొచేస్తోంది. అయితే సాయి పల్లవి గత కొంతకాలంగా ఏ సినిమాకి సైన్ చెయ్యలేదు. తెలుగులో విరాట పర్వం తర్వాత ఆమె మరో చిత్రం లో నటించలేదు. దీంతో సాయి పల్లవి సినిమాల నుంచి తప్పుకోనుందని.. ఆమె డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కానీ అవేవి నిజం కాదని తాజాగా వచ్చిన ఒక అప్డేట్ చెప్తోంది. సాయి పల్లవి తాజాగా ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడ శేఖర్ కమ్ముల శిష్యుడు డైరెక్ట్ చేయబోతున్న ఈ వెబ్ సిరీస్లో సాయి పల్లవి నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం. నెట్ ఫైల్స్ కోసం రూపొందుతున్న ఆ నాయికా ప్రధానమైన సిరీస్ కి సాయి పల్లవి అయితేనే కరెక్టుగా ఉంటుందని భావించి ఆమెను సంప్రదించినట్టు సమాచారం. సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
సాయి పల్లవి చేసినవి వేళ్ళమీద లెక్కపెట్టే సినిమాలు. కానీ ఏళ్ళతరబడి గుర్తుండిపోతాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ మధ్య కాలంలో తన నుంచి ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ కాలేదు. ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదంటే కారణం అవకాశాలు రావడం లేదని కాదు.ఆమెకు నచ్చే కథలు ఆమె దగ్గరుకు వెళ్ళలేదని అర్థం. దీంతో ఆమె తదుపరి ప్రాజెక్టుల కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
End of Article