సగం షూటింగ్ అయ్యాక “లిప్ లాక్” అని దర్శకుడు ఒత్తిడి…హీరో కలగచేసుకునేసరికి.?

సగం షూటింగ్ అయ్యాక “లిప్ లాక్” అని దర్శకుడు ఒత్తిడి…హీరో కలగచేసుకునేసరికి.?

by Anudeep

Ads

సాయి పల్లవి.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. పక్కింటమ్మాయి లా ఉంటె సాయి పల్లవి తానూ ఎంచుకునే సినిమాలలో ఎంతో వైవిధ్యాన్ని కనబరుస్తూ ఉంటుంది. రొమాంటిక్ సీన్లకు, ఎక్సపోసింగ్ కు సాయి పల్లవి చాలా దూరం గా ఉంటుంది. తన వ్యక్తిత్వానికి తగ్గ పాత్రలనే ఎంచుకుంటుంది. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ లో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఇమడటం కొంచం కష్టమే. ఎందుకంటే, ఇక్కడ హీరోయిన్లను కేవలం రొమాన్స్ ని స్క్రీన్ పై పండించడానికి అన్నట్లు చూస్తుంటారు. ఈ విషయం పై చాలా మంది హీరోయిన్లు కూడా కొన్ని సార్లు ఇంటర్వ్యూలలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు.

Video Advertisement

ఇండస్ట్రీ లో ఎదురయ్యే వేధింపులను బయటకు చెబుతూ “మీటు” అనే క్యాంపైన్ స్టార్ట్ అయింది. ఈ హాష్ టాగ్ తో తాము పడ్డ ఇబ్బందులను సోషల్ మీడియా లో వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే, పధ్ధతి గా ఉంటేనే సినిమా చేస్తా అని గిరి గీసుకుని చెప్పే సాయి పల్లవి కి కూడా ఇలాంటి యిబ్బంది తప్పలేదట. ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూ లో తన పర్సనల్ లైఫ్ లోని విషయాలను కూడా పంచుకుంది. న్యూస్ 18 కథనం ప్రకారం…ఓ సినిమా లో రొమాంటిక్ సీన్స్ లేవని ఒప్పుకోవడం తో, సినిమా సగం షూట్ చేసాక లిప్ లాక్ సీన్ చేయాలంటూ సదరు దర్శకుడు సాయి పల్లవి పై ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టాడట. అయితే, సాయి పల్లవి అందుకు ససేమిరా అందట. అలాంటి సీన్లలో చేయను అని ముందే చెప్పను కదా అని సాయి పల్లవి వాదించిందట.

ఈ సమయం లో ఆ సినిమా హీరో కలుగ చేసుకుని ఆమెను ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కించాడట. ఆమె చేయను అంటోంది కదా.. ఎందుకు ఒత్తిడి చేస్తారు. ఆమె వద్దు అనుకుంటున్నపుడు వదిలేయమని డైరెక్టర్ కు సలహా ఇచ్చాడట. మళ్లీ ఆమె “మీ టూ ” పేరిట బయట చెబితే అందరం ఇబ్బందుల్లో పడతాం అని చెప్పుకొచ్చాడట. దీనితో, కన్విన్స్ అయిన డైరెక్టర్ సాయి పల్లవి ని ఇకపై ఇబ్బంది పెట్టలేదట. రొమాన్స్ అనే కాదు.. అన్ని విషయాల్లోనూ సాయి పల్లవి తన పరిధి మేరకే ప్రవర్తిస్తుంది. గ్లామర్ డ్రెస్సులు కూడా అతిగా వేసుకోదు. తన కుటుంబ సభ్యులు తన సినిమా ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలగాలి అని సాయి పల్లవి భావిస్తుంది. తన కుటుంబ సభ్యుల గౌరవం మేరకే తానూ ప్రవర్తిస్తుంటానని సాయి పల్లవి చెబుతూ ఉంటుంది.

అందం, అభినయం మాత్రమే కాదు అంతులేని ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం కూడా సాయి పల్లవి సొంతం. అందుకే ఆమె టాలెంట్ ను, వ్యక్తిత్వాన్ని చూసి అభిమానించే వారు ఎక్కువ గా ఉంటారు. అందుకు ఓ ఉదాహరణే.. ఇమా ఆడ్స్ ను రిజెక్ట్ చేయడం. రెండు నిమిషాల పాటు నటిస్తే.. రెండు కోట్ల రూపాయలు వచ్చే ఆఫర్ ను ఆమె వద్దనుకుంది. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అని తాను తన అభిమానులను మోసం చేయలేనని చెబుతుంది. తనపై నమ్మకం పెట్టుకుని అభిమానులు మోసపోవడం తనకు ఇష్టం లేదని నిర్మొహమాటం గా చెప్పేస్తుంది. అందుకే ఆమె అంత ప్రత్యేకం.


End of Article

You may also like