Ads
మలయాళ నటి సాయి పల్లవి డాన్స్ షో లతో గుర్తింపు పొంది..హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్నారు. ఆమె తన సహజ నటనతో ఎందరో అభిమానులను గెలుచుకున్నారు. స్వతహాగా డాన్సర్ అయిన సాయి పల్లవి తెలుగులో ‘ఢీ’ షో తో పాటు కన్నడ, తమిళ భాషల్లో ప్రసారమైన డాన్స్ షోస్ లో పాల్గొని ప్రతిభ నిరూపించుకున్నారు.
Video Advertisement
కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు చేసి సాయిపల్లవి..మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ గా మారారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తర్వాత వచ్చిన ఫిదా చిత్రం తో తెలుగు వారికీ దగ్గరయింది సాయి పల్లవి.
గ్లామర్ షో కి దూరం గా.. నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకొనే సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాల సంఖ్యా చాలా ఎక్కువే. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ, విరాట పర్వం చిత్రాల తర్వాత గార్గి చిత్రం మాత్రమే చేసింది సాయి పల్లవి. కానీ ఆ తర్వాత మరో చిత్రం ప్రకటించలేదు సాయి పల్లవి. దీంతో ఆమె నటనకు దూరం కానుందన్న పుకార్లు వినిపిస్తున్నాయి.
సాయి పల్లవికి ప్రస్తుతం నటన పై ఆసక్తి లేదని.. ఆమె డాక్టర్ అయ్యే ప్రయత్నాల్లో బిజీ గా ఉందని తెలుస్తోంది. అందుకే చాలా కాలం గా ఏ కొత్త కథలు వినడానికి ఆమె ఆసక్తి చూపట్లేదని సమాచారం. అయితే సాయి పల్లవి నిజంగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనుందా..?? లేదా సినిమాలు ఒప్పుకోకపోవడిని వేరే కారణం ఏదైనా ఉందా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
End of Article