హీరోయిన్ సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సాయి పల్లవి ఇప్పటికే పలు సినిమాలు చేసి అందరినీ ఫిదా చేసేసింది. ఈ మలయాళ నటి డాన్స్ షోల తో గుర్తింపు పొంది హీరోయిన్ గా అవకాశాలని సంపాదించుకుంది. సహజ నటన తో ఆకట్టుకుంటూ అభిమానులను గెలుచుకుంది సాయి పల్లవి.

Video Advertisement

సాయి పల్లవి తెలుగులో ఢీ షో తో పాటు కన్నడ తమిళ భాషల్లో కూడా డాన్స్ షోస్ లో పాల్గొని తన ట్యాలెంట్ ని నిరూపించుకుంది.

sai pallavi coming with a web series..??

సాయి పల్లవి సినిమాలు విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. అన్ని సినిమాలని ఆమె ఒప్పుకోదు. ఆమె మంచి పాత్రలకే ఎస్ చెబుతూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి కొన్ని సినిమాలు ని రిజెక్ట్ చేసింది ఈమె పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన అవకాశాలు వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తోంది. సినిమాలు లేకపోతే ఖాళీగా ఉండి వైద్య వృత్తి చేసుకుంటానని ఈమె చెప్పింది. కానీ ఇష్టం లేని సినిమాలను మాత్రం చేయనని చెప్పింది సాయి పల్లవి.

sai pallavi shocking decision..

స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కూడా ఈమె వదులుకుంటుంది. భీమ్లా నాయక్ సినిమా లో హీరోయిన్ గా మొదట సాయి పల్లవికి అవకాశం వచ్చింది కానీ ఆమె రిజెక్ట్ చేసింది. అప్పుడు నిత్యా మీనన్ ని ఫిక్స్ చేసారు. అలానే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం ఆమెను సంప్రదించారు కానీ దానికి కూడా ఆమె నో చెప్పింది.

సరిలేరు నీకెవ్వరు సినిమాని కూడా ఈమె రిజెక్ట్ చేసింది. ఈ మధ్య వచ్చిన తెగింపు సినిమాని కూడా ఆమె రిజెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 200 కోట్ల కి పైగా గ్రాస్ వసూళ్లను చేసింది. లోకేష్ కనగ రాజ్ విజయ్ కాంబినేషన్లో వచ్చిన లియో సినిమా కోసం కూడా ఈమెని అడిగారు. కానీ ఆమె ఎక్కువ సీన్లు లేకపోవడంతో ఆ సినిమాని కూడా వదులుకుంది.