సలార్ ప్రమోషన్స్ ఈ రకంగా చేయబోతున్నారా..? ఆ డైరెక్టర్ తో ఇంటర్వ్యూ..?

సలార్ ప్రమోషన్స్ ఈ రకంగా చేయబోతున్నారా..? ఆ డైరెక్టర్ తో ఇంటర్వ్యూ..?

by Mohana Priya

Ads

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. సినిమా మీద ఇప్పటికే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు సినిమా ఫలితాలు ఎలా ఉన్నా సరే ప్రభాస్ సినిమా కోసం జనాలు ఎదురు చూస్తూనే ఉంటారు. దీన్నిబట్టి ప్రభాస్ క్రేజ్ ఎలా ఉంది అనేది మనమే అర్థం చేసుకోవాలి.

Video Advertisement

అయితే సినిమా బృందం ఇవాళ ఒక పాట విడుదల చేశారు. సూరీడే అని ఈ పాటని చూస్తూ ఉంటే స్నేహితుల మధ్య వచ్చే పాట అని అర్థం అవుతోంది. అయితే సినిమా మీద కామెంట్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అందుకు కారణం ఇంకొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని సినిమా బృందం ప్రమోషన్స్ చేయట్లేదు. కొన్ని రోజుల క్రితం ట్రైలర్ విడుదల చేశారు.

ఇవాళ ఒక పాట రిలీజ్ చేశారు. అంతేకానీ సినిమా బృందం ఎక్కడా బయటికి వచ్చి ప్రమోషన్స్ చేయట్లేదు. దాంతో చాలామంది అభిమానులు ఒక్క ప్రమోషనల్ వీడియో అయినా చేయొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నారు అని, దాంతో ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం లేదు అని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదు అనే వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా బృందం ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నట్టు సమాచారం. అది కూడా ప్రముఖ దర్శకుడు రాజమౌళి వీరిని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. మరి ఇందులో ప్రభాస్ పాల్గొంటారో, లేదో అనేది తెలియదు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ని, మరొక హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ని కూడా రాజమౌళి ఇంటర్వ్యూ చేస్తారు. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


End of Article

You may also like