సలార్ మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన సూరీడు సాంగ్…!

సలార్ మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన సూరీడు సాంగ్…!

by Mounika Singaluri

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22 తారీఖున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు ఫ్యాన్స్ అలరించే విధంగా ఇటువంటి ప్రమోషనల్ కంటెంట్ ను మూవీ టీం విడుదల చేయలేదు. మొన్న ట్రైలర్ విడుదల చేసినప్పటికీ కూడా అది అంతగా ఆకట్టుకోలేదు.

Video Advertisement

అయితే రిలీజ్ ముందు మరొక ట్రైలర్ విడుదల చేస్తామని మూవీ టీం ప్రకటించింది. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అయితే తప్పకుండా ఉంటాయని గ్యారెంటీ ఇస్తుంది. ప్రభాస్ ను ఇప్పటివరకు చూడని విధానంలో మాస్ అవతారంలో ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేశాడంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేకుండా డైరెక్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అది ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏ మాత్రం మింగుడు పడటం లేదు. అయితే తాజాగా ఈ సినిమా నుండి సూరీడు అనే సాంగ్ విడుదల అయింది. ఇప్పటివరకు చతికిలబడిపోయిన సినిమా హైప్ ను ఈ సాంగ్ ఒక్కసారిగా పైకి లేపింది. ఈ సాంగ్ ఇద్దరి స్నేహితుల మధ్య బంధాన్ని తెలిపే విధంగా ఉంది. ఎమోషనల్ గా సాగుతూ విన్న వెంటనే అందరికీ నచ్చేసింది. ఇది కదా మాకు కావాల్సింది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సాంగ్ విని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


You may also like

Leave a Comment