“సలార్” ట్రైలర్ తో డైరెక్టర్ ఇచ్చిన ఈ హింట్ గమనించారా.? ఇలాగే ఉండబోతుందా.?

“సలార్” ట్రైలర్ తో డైరెక్టర్ ఇచ్చిన ఈ హింట్ గమనించారా.? ఇలాగే ఉండబోతుందా.?

by Harika

Ads

కేజిఎఫ్ ఏం ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘సలార్’. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. కొన్ని పరిస్థితుల కారణంగా బద్ధ శత్రువులు అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ పై ఈ మూవీ తెరకెక్కించిన విషయం రీసెంట్ గా ప్రశాంత్ నీల్ రివిల్ చేయడం జరిగింది. అక్టోబర్ 28న థియేటర్లలో విడుదల కావలసిన ఈ చిత్రం తెలియని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు డిసెంబర్ 22 కి విడుదలకు సిద్ధంగా ఉంది.

Video Advertisement

ఇక ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్ర బృందం ఈరోజు సలార్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా అతనిపై విపరీతమైన హైప్ పెంచారు. ఇక ఈరోజు వచ్చిన ట్రైలర్లు కథకు సంబంధించిన ముఖ్యమైన పాత్రలతో పాటు చివరిలో ప్రభాస్ను ఓ రేంజ్ లో హైలైట్ చేశారు. ఎంతో ప్రామిసంగా ఉన్న ఈ ట్రైలర్ సలార్ మూవీ కచ్చితంగా సాలిడ్ హీట్ అని స్ట్రాంగ్ గా చెబుతోంది.

ఇక ఆ విషయం పక్కన పెడితే ట్రైలర్లో డైరెక్టర్ ఆల్మోస్ట్ స్టోరీ గురించి బాగానే హింట్ ఇచ్చాడు.ఖన్సార్ అనే ప్రాంతానికి తన తర్వాత తన కొడుకే వారసుడు కావాలని రాజమన్నార్ (జగపతిబాబు) భావిస్తాడు. అయితే రాజమన్నార్ అక్కడ లేని సమయంలో అతని కొడుకుపై దాడి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురు తిరిగిన వందల మందితో పోరాడడానికి అతను అతని స్నేహితుడిని సహాయంగా పిలుస్తాడు. ఆ దేవా ఎవరో కాదు ప్రభాస్. సలార్ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి దేవాకు..వరద రాజమన్నార్ కు మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండ్ చూపిస్తారు. ఈ స్టోరీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంటే స్టోరీ పార్ట్ వన్ ఎండింగ్ టైం కి ఇద్దరి ఫ్రెండ్షిప్ మధ్య స్ప్లిట్ వస్తాయేమో చూడాలి. స్టోరీ పూర్తిగా మనకు తెలియాలంటే డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like