Ads
ఈమధ్యకాలంలో తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ యాసలో ఎక్కువగా చిత్రాలు వస్తున్నాయి. అలాగే స్టార్ హీరోలు సైతం తెలంగాణ యాసలో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తాజాగా విడుదల అయిన దసరా మూవీ కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రమే. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా విడుదల అయ్యి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.
Video Advertisement
ఇటీవల వచ్చిన బలగం సినిమా చిన్న సినిమా అయినప్పటికి భారీ విజయాన్ని పొందడానికి కారణం తెలంగాణ నేటివిటీని డైరెక్టర్ వేణు వెల్డండి సరిగ్గా ఉపయోగించుకోవడం వల్లనే సాధ్యం అయ్యింది. బాలీవుడ్ సినిమాలో తాజాగా తెలంగాణ బతుకమ్మ పాట వినిపించింది. తెలంగాణ జానపద గీతం అయిన బతుకమ్మ బాలీవుడ్ కు చేసరుకుంది. బాలీవుడ్ కాండల వీరుడు సల్మాన్ ఖాన్, పూజాహెగ్డే హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో బతుకమ్మ పాటను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ సినిమా రంజాన్ పండగను సందర్భంగా ఏప్రిల్ 21 రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అందువల్ల తెలుగు మార్కెట్ ని ప్రొడ్యూసర్స్ టార్గెట్ చేశారు. దానిలో భాగంగానే తెలంగాణ పువ్వుల పండుగ అయిన బతుకమ్మ మీద సాంగ్ ని పెట్టడమే కాకుండా డబ్బింగ్ చేయకుండా తెలుగులో ఆడియో రికార్డింగ్ మరియు పాటను చిత్రీకరించి విడుదల చేశారు. ఈ పాటలో వెంకటేష్, సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, భూమిక, రోహిణి హట్టంగడితో పాటు క్యాస్టింగ్ అంతా పాటలో ఉంది.
ఈ సాంగ్ ను కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ఈ సినిమాకి ఫర్హాద్ సమ్జీ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు రీమేక్ అని ఎప్పటి నుండో అంటున్నారు. అయితే ఒక్క లైన్ తీసుకుని ఎన్నో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ నటించడం వల్ల ఈ సినిమా తెలుగు వెర్షన్ ని కూడా భారీగా ప్రమోట్ చేయబోతున్నారు. Also Read: రజనీకాంత్ మూవీ వల్ల నా కెరీర్ ముగిసిపోయింది.. వైరల్ అవుతున్న మనీషా కోయిరాల కామెంట్స్
End of Article