తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాక్ట్రెస్ ల లో సమంత ఒకరు. సమంత తండ్రి తెలుగు, తల్లి మలయాళీ. కానీ సమంత కుటుంబం చెన్నైలోని పల్లావరం లో స్థిరపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకునే రోజుల్లోనే పార్ట్ టైం ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు సమంత.

ఎన్నో పార్ట్ టైం ఉద్యోగాలు చేసిన తర్వాత తన స్నేహితురాలికి తెలిసిన వాళ్ళు అయిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్ తీసిన ఒక ఫోటో ద్వారా సమంత కి మోడలింగ్ లో అవకాశం వచ్చింది. అలా మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించారు.

మోడలింగ్ ద్వారా సమంత ఎన్నో ప్రకటనల్లో నటించారు. శ్రియ నటించిన ఈవా టాల్కమ్ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ లో కనిపించే చెయ్యి శ్రియ ది కాదు. శ్రియ కి హ్యాండ్ మోడల్ గా యాక్ట్ చేసిన సమంత .నాయుడు హాల్ కి మోడలింగ్ చేస్తున్నప్పుడు సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తను తీయబోయే సినిమా లో హీరోయిన్ గా సమంత ని నటించామన్నారు. అలా సమంత మొదటి సినిమా మాస్కోవిన్ కావేరి లో రాహుల్ రవీంద్రన్ కి జంటగా నటించారు. తర్వాత తమిళ్ లో బాణా కాత్తడి సినిమాలో కూడా నటించారు.

అప్పుడే గౌతమ్ మీనన్ తను తీయబోయే తెలుగు సినిమా కోసం హీరోయిన్ ఎంపిక కి ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సమంత కూడా ఆ ఆడిషన్స్ కి వెళ్లి ఆడిషన్ ఇచ్చారు. తెలుగు రాకపోయినా కానీ ఏదో వచ్చీరాని తెలుగులో మేనేజ్ చేసి ఆడిషన్ ఇచ్చి వచ్చేశారు.

కొన్ని రోజుల తర్వాత గౌతమ్ మీనన్ ఆఫీస్ నుండి సమంత కి తను సెలెక్ట్ అయినట్టు కాల్ వచ్చింది. దాంతో తన మొదటి తెలుగు సినిమా ఏం మాయ చేశావే ద్వారా తెలుగు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలం తర్వాత అంత మంచి ప్రేమకథ చూశామని ఎంతోమంది ఏం మాయ చేసావే సినిమాని అభినందించారు.

తర్వాత దూకుడు, బృందావనం, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా వరుస హిట్లతో దూసుకుపోయారు. తమిళ్ లో కూడా తను నటించిన కత్తి బ్లాక్ బస్టర్ అయింది.

గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అఆ, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఈగ, మనం, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ, అలాగే తమిళ్ లో సూపర్ డీలక్స్ వంటి నటనకు ఆస్కారం ఉన్న సినిమాల్లో కూడా నటించారు.

తెలుగులో తన మొదటి చిత్రం లో తనతో పాటు నటించిన నాగ చైతన్య ని పెళ్లి చేసుకొని అక్కినేని కుటుంబ సభ్యురాలు అయ్యారు. అలా ఎంతో కష్టపడి టాప్ హీరోయిన్ అనే పేరును సంపాదించుకున్న సమంత రేర్ ఫొటోస్ కొన్ని ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

#21

#22

#23

#24

#25

#26

#27

#28

#29

#30

#31

#32

#33

#34

#35

#36

#37

#38

#39

#40

#41

#42

#43

#44

#45

 

#46

#48

#49

#50