సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి.times of india whatsapp chat with samantha about divorce

ఇవన్నీ మాత్రమే కాకుండా సమంత ఇంస్టాగ్రామ్ లో చేసే పోస్ట్స్ కూడా చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల సమంత ఎక్కడో వేరే ప్రదేశంలో ఉన్న పిక్చర్ ఒకటి పోస్ట్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా ఇగ్నోర్ చేయాలి అనే విధంగా కోట్స్ షేర్ చేస్తున్నారు. ఇవాళ కూడా కొన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ పెట్టారు సమంత. అందులో ఒక దాంట్లో మీడియాలో కనిపించేది ఒకటి, రియాలిటీ ఒకటి అని అర్థం వచ్చేలాగా ఒక పెట్ పేజీ నుండి ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ పోస్ట్ లో  ఏం అర్థం దాగుందో  సమంతకే తెలియాలి.

అయితే వీరిద్దరిపై మాత్రం ప్రస్తుతం చాలా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన వీరు అధికారిక ప్రకటన ఇస్తారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజమో, ఎంతవరకు పుకారు అనేది మాత్రం తెలియదు. ప్రస్థుతం సమంత కాత్తు వాక్కుల రెండు కాదల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా, నయనతార మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు.