Ads
హీరోయిన్ సమంత తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ వ్యాధికి గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేసింది. సమంత ‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ కోరుకుంటూ ట్వీట్స్ చేశారు.
Video Advertisement
ఆటో ఇమ్యూన్ కారణంగా శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను మయోసైటిస్ అని పిలుస్తుంటారు. యితే ఈ వ్యాధి రకరకాలుగా ఉంటుంది. అందులో సమంతకు వచ్చిన వ్యాధి ఏ రకమో ఆమె తెలుపలేదు. అయితే తాజాగా సమంత స్టేజి 3 మయోసిటిస్ తో బాధ పడుతున్నట్లు ఆమె సహా నటి వెల్లడించారు. దీంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
ఈ వ్యాధిపై మరో నటి కీలక వ్యాఖ్యలు చేసింది. తాను కూడా అలాంటి వ్యాధితోనే బాధపడుతున్నట్లు పేర్కొంది. తాజాగా యశోదలో నటించిన నటి కల్పిక గణేష్ సమంత ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘యశోద’ సినిమాకి సంబంధించిన ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో మాట్లాడిన కల్పిక గణేష్ .. తాను కూడా సమంతలానే ఆ వ్యాధితో బాధపడుతున్నాననీ తెలిపింది. అయితే తనది ఫస్ట్ స్టేజ్ అనీ, సమంతది మూడో స్టేజ్ అనీ చెప్పుకొచ్చింది.
ఈ సమస్య గురించి సమంతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కల్పిక చెప్పింది. కల్పిక తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది. సమంతకి ఉన్న హెల్త్ ఇష్యూ కల్పిక కి కూడా గత 13 ఏళ్ల నుంచి ఉంది ఆమె తెలిపింది.
మరో వైపు ఇటీవల సమంత నటించిన ‘యశోద’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. హరి, హరీష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన యశోద చిత్రం పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజైంది. తొలి ఐదు రోజుల్లోనే ఓవరాల్‌గా రూ.21.45 కోట్లని కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఓవర్‌సీస్‌లో రూ.5.8 కోట్లు రాబట్టడం విశేషం. ఈ సినిమాని రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.
End of Article