Ads
‘సమంత’ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో తెలుగు నట అడుగుపెట్టి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది సామ్. విభిన్న పాత్రలు, వైవిధ్యమైన కథలు ఎంచుకొనే సామ్ గత కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది.
Video Advertisement
అంతే కాకుండా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది సమంత . విడాకుల అనంతరం సామ్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయ్యింది. ఇటీవలే పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా పాటతో రచ్చ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.
శాకుంతలం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతండగా.. ఖుషి, యశోద చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇందులో లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వస్తోన్న మూవీ యశోద. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. లేడి ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సమంత కేవలం 50 రోజులకు కాల్షీట్స్ మాత్రమే ఇచ్చినట్టు సమాచారం. కాల్షీట్లు తక్కువ ఇచ్చినా.. ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ మాత్రం భారీగా ఉందని తెలుస్తోంది. సమంత యశోద సినిమా కోసం ఏకంగా 2.75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఫిలిం వర్గాల సమాచారం.
సమంత ఇది వరకే పలు సినిమాలకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ తన కాల్ షీట్స్ కూడా ఎక్కువగా ఉండేవి కానీ 50 రోజుల కాల్ షీట్ కోసం రెమ్యూనరేషన్ కి ఈ స్థాయిలో తీసుకోవడం అంటే నిజంగానే భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హరీష్- హరి ద్వయం తెరకెక్కిస్తున్న ఈ సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ నిజమైన క్రైమ్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందుతుందని నిర్మాతలు ముందే వెల్లడించారు.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఈమె శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా గుణశేఖర్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శాకుంతల కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
End of Article