Ads
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
Video Advertisement
అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.
అప్పుడప్పుడు ఇతర సెలెబ్రిటీల పోస్ట్ లపై కూడా సరదాగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా.. యంగ్ హీరో తేజ సజ్జా పోస్ట్ పై స్పందించిన సమంత సెటైరికల్ గా కామెంట్ చేసారు. తేజ సజ్జ ఒక ఫోటో ని షేర్ చేస్తూ.. “ఎక్స్ క్యూజ్ మీ లేడీస్..” అంటూ కాప్షన్ ను జత చేసారు. ఈ పోస్ట్ కు సమంత దర్శకురాలు నందు రెడ్డిని టాగ్ చేస్తూ సరదాగా స్పందించారు.
“ఏంటి ఒక్క ఫోటోకేనా..? అంత ఈజీ అనుకుంటున్నావా..? మనం ఇతనికి ఏమి నేర్పించలేదా…? అంటూ దర్శకురాలు నందు రెడ్డిని టాగ్ చేసి కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ పై చాలా మంది సమంత ఫాన్స్ సరదాగా స్పందిస్తున్నారు. ఈ కామెంట్ పై స్పందించిన తేజ సజ్జా సమంతను ఉద్దేశించి.. “నువ్వు నేను సంపాదించుకున్నా అభిమానమంతా నాశనం చేసేసావు..” అంటూ సరదా కామెంట్ ను పోస్ట్ చేసారు. నందిరెడ్డి దర్శకత్వంలో.. తేజ సజ్జా, సమంత కలిసి “ఓ బేబీ” సినిమాలో నటించారు. ఆ సమయంలో వీరి స్నేహం చిగురించింది.
https://www.instagram.com/p/CaJcmIHha7B/
End of Article