సీనియర్ హీరోల సినిమా టైటిల్స్ తోనే… తెరకెక్కిన 5 చిరంజీవి సినిమాలు ఏంటో తెలుసా.?

సీనియర్ హీరోల సినిమా టైటిల్స్ తోనే… తెరకెక్కిన 5 చిరంజీవి సినిమాలు ఏంటో తెలుసా.?

by Anudeep

Ads

త్వరలో ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన గాడ్ ఫాదర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మన మెగాస్టార్ చిరంజీవి. మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న లుసిఫెర్  చిత్రానికి అనుగుణంగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం పొలిటికల్ డ్రామా కథాంశం ఆధారంగా రూపొందుతుంది.

Video Advertisement

ఈ చిత్రానికి గాను మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ వంటి వారు ప్రధానపాత్రలో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి  తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. గాడ్ ఫాదర్ అనే చిత్రం పేరు వినగానే ఇంతకుముందు ఎవరో మన స్టార్ హీరో చేసినట్లు గుర్తుకు వస్తుంది కదూ…

God father

ఇలా ఒకే పేరుతో వచ్చిన మన తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి.. అందులో కొన్ని చిరంజీవి చిత్రాలు కూడా ఉన్నాయి. మరి ఆ చిత్రం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ లిస్టు ఒకసారి చూసేయండి..

#1. ఇంటి గుట్టు :

వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు. 1984లో కె.బాపయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఇంటిగుట్టు చిత్రం.

#2. ఆరాధన :

1976 లో ఎన్టీఆర్ వాణిశ్రీ నటించిన ఆరాధన చిత్రం అప్పటిలో ఘనవిజయాన్ని సాధించింది. అదే చిత్రం పేరు మీదుగా 1987లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన చిరంజీవి ఆరాధన చిత్రం.

#3. దేవాంతకుడు:

 

పి. పుల్లయ్య దర్శకత్వం లో తారక రామారావు గారు నటించిన దేవాంతకుడు చిత్రం. ఆ తర్వాత కాలంలో ఎస్. కే చంద్రశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన దేవాంతకుడు చిత్రం పేరుతో వచ్చింది.

#4 జేబుదొంగ :

నటభూషణ శోభన్ బాబు నటించిన జేబు దొంగ చిత్రం ఆ తర్వాతి కాలంలో అదే టైటిల్ తో చిరంజీవి నటించిన జేబుదొంగ చిత్రం వచ్చింది

#5 గాడ్ ఫాదర్ :

1995 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇప్పటి కాలంలో మన చిరంజీవి గారి గాడ్ ఫాదర్ చిత్రం గా రాబోతుంది.


End of Article

You may also like