జూన్ 2న ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 280 మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ ప్రమాదం పై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా ఇతర దేశాల అధినేతలు మరణించిన వారి ఫ్యామిలిలకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
Video Advertisement
ప్రధాన మంత్రి నరేంద్రమోడి కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం అచ్చం ఒక సినిమాలోని రైలు ప్రమాదం లాగే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. మరి ఆ చిత్రం ఏమిటో? ఆ రైలు ప్రమాదం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఒరిస్సాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదం లో 280కి పైగా మరణించగా, 1000కి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని భారత దేశ రైల్వే హిస్టరీలోనే అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా అనుకుంటున్నారు. నలబై సంవత్సరాల క్రితం హార్‌లోని సహస్ర దగ్గర ఒక ప్యాసింజర్ రైలు ప్రమాదంలో 500 మంది మరణించారు.
ఇదే ఇప్పటివరకు అత్యంత ఘోరమైన ప్రమాదం. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 280 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాల పై భిన్నామైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొందరు ఈ ప్రమాదం ఇటీవల రిలీజ్ అయిన “విడుదల పార్ట్ 1” సినిమాలో జరిగినట్లే ఉంది అని అంటున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించాడు. ఆయన చిత్రాలు ఎక్కువగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతాయి.
ఈ చిత్రం రిలీజ్ అయినపుడు కూడా ఈ మూవీలో కొన్ని సీన్స్, కొందరు వ్యక్తులు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని టాక్ వినిపించింది. విడుదల పార్ట్ 1 సినిమా రైలు ప్రమాద సన్నివేశంతో మొదలవుతుంది. అయితే ఈ సినిమాలో ఇక ట్రైన్ ను బాంబుతో పేల్చే స్తారు. అయితే ప్రమాదం మాత్రం అచ్చం ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదం లాగే ఉండడంతో సేమ్ టు సేమ్, ఆ సినిమాలోని సీన్ రిపీట్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: రియల్ TO రీల్..! అసలు నిజ జీవితంలో ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?