Ads
సినిమా ఇండస్ట్రీ అన్నాక… చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు. అందరికి విజయం లభించాలనేమి లేదు. కొందరు నిలదొక్కుకోలేక వెళ్లిపోతుంటారు. కొందరు మరో భాష లో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి కోవకి చెందిన హీరోయిన్ సమీరా రెడ్డి. తెలుగునాట మూడు సినిమాల్లో సమీరా హీరోయిన్ గా నటించారు. అవేవి విజయం సంపాదించిపెట్టలేదు. ఆ తరువాత ఆమె హిందీ, బెంగాలి, కన్నడ, తమిళ్ చిత్రాల్లో నటించింది. అక్కడ పాపులర్ హీరోయిన్ అయిపొయింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో సినిమాలకు దూరమైంది. ఇటీవల ఆమె ఇంటర్వ్యూ లో సంచలన విషయాలను తెలిపింది. అవేంటో చూద్దాం..
Video Advertisement
జూనియర్ ఎన్టీఆర్ హీరో గా “నరసింహుడు” అనే సినిమా తో సమీరా రెడ్డి తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా పై భారీ గా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇది డిజాస్టర్ గా మిగిలింది. ఆ తరువాత మెగాస్టార్ జై చిరంజీవ సినిమా లో కూడా సమీరా నటించారు. ఈ సినిమా కూడా పరాజయం పొందింది. ఆ తరువాత ఎన్టీఆర్ తోనే అశోక్ సినిమా లో నటించారు. ఈ సినిమా కూడా ఆశించినంతగా విజయం సాధించలేదు. చేసిన మూడు సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ కాకపోవడం తో, సమీరా రెడ్డి తెలుగు పరిశ్రమ కు దూరమైంది. హిందీ, బెంగాలి, కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి తన టాలెంట్ ను నిరూపించుకుంది. అయితే, కెరీర్ మంచి గా ఎదుగుతుండగానే, సమీరా సినిమా లు చేయడం ఆపేసారు. ఆ తరువాత సంవత్సరానికి 2014 వ సంవత్సరం లో అక్షయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత సినిమాలకు దూరం గానే ఉంది.
ఫిల్మ్ బీట్ కధనం ప్రకారం.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సమీరా రెడ్డి తన గురించి పలు విషయాలను పంచుకుంది. తల్లి గా ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది. ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తానూ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. దానికి ఎవరిని నిందించడం లేదని, ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుందని చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ..’తల్లి అయినా తరువాత కూడా అందం గా కనిపించడం కొందరికే సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చింది. మళ్ళీ నేను సన్నగా అయి అందం గా కనిపించడానికి కూడా కొంత సమయం పడుతుందన్నారు.
తానూ గర్భిణీ గా ఉన్నప్పటి ఫోటో ను పోస్ట్ చేస్తే, కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా దారుణం గా ట్రోల్ చేసారు అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలని కనాలి అనుకునే వారు శారీరకం గా, మానసికం గా వచ్చే మార్పులకు సిద్ధం గా ఉండాలన్నారు. ఆ సమయం లో కోపం, ఫ్రస్ట్రేషన్ వంటివి ఎక్కువ గా వస్తాయని అందుకు సిద్ధపడాలన్నారు. ఆ సమయం లో తన భర్త అక్షయ్ ఎంతో ఓర్పు గా తనకు అండగా నిలబడ్డారని, తన వల్లే తానూ ఇలా ఉండగలుగుతున్నానని సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు.
End of Article