Ads
- చిత్రం: సమ్మతమే
- నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి
- నిర్మాత: కనకాల ప్రవీణ
- దర్శకత్వం: గోపినాథ్ రెడ్డి
- సంగీతం: శేఖర్ చంద్ర
- విడుదల తేదీ: జూన్ 24, 2022
Video Advertisement
స్టోరీ:
కిరణ్ అబ్బవరం (కృష్ణ) అనే పాత చేశాడు.. . చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. అప్పటినుంచి ఇంట్లో ఆడవాళ్లు ఉంటేనే మంచిదనే భావనతో ఉంటాడు. తొందరగా పెళ్లి చేసుకుని ఇంటికి ఇల్లాలిగా తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు తనను చూస్తేనే చాలు.. అసహ్యించుకునే శాన్వి (చాందినీ చౌదరి)ని కలుస్తాడు. అలా గొడవలతో మొదలైన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. కృష్ణ అతి ప్రేమని సాన్వి భరించలేకపోతుంది. మెల్లమెల్లగా కృష్ణపై శాన్వికి ఆసక్తి తగ్గిపోతుంది. మళ్లీ గొడవలు ప్రారంభమవుతాయి. ఇలా గొడవలు పడుతూ సాగే వీరిద్దరి ప్రయాణంలో చివరికి కృష్ణ శాన్విని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే తప్పక మూవీ చూసి తీరాల్సిందే..
రివ్యూ:
కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది టాలెంట్ ఉన్న కొత్త కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వాళ్లలో కిరణ్ అబ్బవరం ఒకరు. ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ అనే సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. మొన్న వచ్చిన సెబాస్టియన్ నిరుత్సాహ పరిచినా.. ఇప్పుడు ‘సమ్మతమే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్.
ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన ‘సమ్మతమే’ మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. కానీ, ఈ చిత్రం నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయని చెప్పుకోవచ్చు. సమ్మతమే’ మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం.. హీరో, హీరోయిన్ ప్రేమలో పడడం వంటి వాటితో సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకెండాఫ్ మాత్రం లాజిక్‌లకు దూరంగా, కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. చివరకు క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.
ప్లస్ పాయింట్స్:
- కామెడీ,
- బ్యాగ్రౌండ్ స్కోర్,
- డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- ఎమోషన్స్ మిస్ అవ్వడం
రేటింగ్:
3/5
టాగ్ లైన్:
స్వచ్ఛమైన ప్రేమ కథలకు యువత ఎప్పుడు ఆకర్షితులు అవుతూనే ఉంటారు. అందుకే ప్రేమ కథ చిత్రాలకు మార్కెట్ లో అంత డిమాండ్. సమ్మతమే కూడా అలాంటి ప్యూర్ లవ్ స్టోరీనే. యూత్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
End of Article