2020 లో విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు సంగీత. ఈ సినిమాలో రష్మిక తల్లి పాత్ర పోషించారు. అంతకుముందు పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి, ఖడ్గం, విజయేంద్ర వర్మ, ఆయుధం ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే శివ పుత్రుడుతో డబ్బింగ్ సినిమాల్లో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించారు సంగీత.

sangeetha about srikanth during sankranthi shooting

ఖడ్గం సినిమాలో తన పర్ఫామెన్స్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఇదే క్యాటగిరిలో సినిమా అవార్డ్ కూడా అందుకున్నారు. అలాగే శివ పుత్రుడు సినిమాకి తమిళ్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్, అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తమిళనాడు స్టేట్ అవార్డ్ కూడా అందుకున్నారు. సంగీత కొంతకాలం క్రితం ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చారు.

sangeetha about srikanth during sankranthi shooting

ఈ షో ద్వారా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. శ్రీకాంత్, సంగీత ఆన్ స్క్రీన్ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అయితే నిజ జీవితంలో శ్రీకాంత్ ని సంగీత అన్నయ్య అని పిలుస్తారట. ఆలీతో సరదాగా షో లో శ్రీకాంత్ కి, సంగీత కి మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పారు సంగీత.

sangeetha about srikanth during sankranthi shooting

సంక్రాంతి షూటింగ్ టైంలో ఇద్దరికి ఒక రొమాంటిక్ సీన్ ఉందట. ఈ సీన్ ఎలా చేయాలి అనే విషయంపై డిస్కస్ చేస్తున్నప్పుడు, శ్రీకాంత్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అందుకు జవాబుగా సంగీత “సరే అన్నయ్య” అని అన్నారట. శ్రీకాంత్ చెప్తున్న ప్రతిసారి “సరే అన్నయ్య. అలాగే అన్నయ్య” అని అన్నారు.

sangeetha about srikanth during sankranthi shooting

దాంతో శ్రీకాంత్ చిరాకు పడ్డారట. డైరెక్టర్ తో కూడా “ఏంటి సర్ ఊరికే అన్నయ్య అన్నయ్య అని అంటుంది” అని సరదాగా అన్నారట. ఈ విషయం గురించి సంగీత ఆలీతో సరదాగా షో లో చెప్పారు. అలాగే శ్రీకాంత్ కుటుంబంతో తనకి చాలా మంచి రిలేషన్ ఉంది అని,  శ్రీకాంత్ భార్య ఊహ కూడా తనతో చాలా బాగా మాట్లాడతారు అని అన్నారు.

watch video :