సంక్రాంతి బరిలో దిగి…100 కోట్లకు పైగా వసూలు సాధించి సత్తా చాటిన 8 సినిమాలు ఇవే.!

సంక్రాంతి బరిలో దిగి…100 కోట్లకు పైగా వసూలు సాధించి సత్తా చాటిన 8 సినిమాలు ఇవే.!

by Harika

సాధారణంగా సంక్రాంతి సీజన్ మనం ఇంత ఎదురుచూస్తామో సినీ పరిశ్రమ వాళ్ళు కూడా అంతే ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు ఏమాత్రం కంటెంట్ ఉన్నా ఓ రేంజ్ లో కలెక్షన్లు రాబడతాయి. అలా సంక్రాంతి కి రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు మనసులు దోచుకోవడమే కాకుండా 100 కోట్లు కొల్లగొట్టిన సినిమా లేవో ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం రిలీజ్ అయిన హనుమాన్ మూవీ సంగతి చూద్దాం.

Video Advertisement

#1. హనుమాన్ :

ఈ సంవత్సరం పండక్కి సంక్రాంతి బరిలో దిగి పెద్ద పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి 290 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ హీరోగా నటించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరించింది.

#2. అలవైకుంఠపురంలో :

ఈ సినిమా కూడా సంక్రాంతి కి విడుదలయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీనికి త్రివిక్రమ్ డైరెక్షన్ అల్లు అర్జున్ యాక్టింగ్ తోడవడంతో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా 260 కోట్ల గ్రాస్ నివసించేలు చేసింది.

#3. వాల్తేరు వీరయ్య :

మొదటిసారిగా చిరంజీవి, రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతి పండక్కి రిలీజ్ అయి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

#4. సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతికి విడుదలయ్యి 220 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది.

#5. గుంటూరు కారం:

ఈ సినిమా విడుదలవుతూనే నెగెటివ్ టాక్ మూట కట్టుకుంది అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద 180 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

#6. ఖైదీ నెంబర్ 150:

మెగాస్టార్ చిరంజీవి మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై 165 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

#7. F2:

వెంకటేష్ వరుణ్ తేజ్ కలసి నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడంతో 130 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది.

#8. వీర సింహారెడ్డి:

మలినేని గోపీచంద్ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి ఇది కూడా సంక్రాంతికి విడుదలయ్యి 127 కోట్ల చేసింది.

the price of balakrishna watch in veerasimhareddy movie..!!


You may also like

Leave a Comment