• చిత్రం : కళ్యాణం కమనీయం
 • నటీనటులు : సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్.
 • నిర్మాత : UV కాన్సెప్ట్స్
 • దర్శకత్వం : అనిల్ కుమార్ ఆళ్ల
 • సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
 • విడుదల తేదీ : జనవరి 14, 2023

kalyanam kamaneeyam movie review

Video Advertisement

స్టోరీ :

ఉద్యోగం లేని భర్త శివ (సంతోష్ శోభన్) కి, ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించే భార్య శృతి (ప్రియా భవానీ శంకర్) కి మధ్య జరిగే కథ ఇది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో శివ ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో శివ ఏం చేశాడు? ఇలాంటి పరిస్థితుల్లో శివ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

kalyanam kamaneeyam movie review

రివ్యూ :

ఈ పండగకి చాలా పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్ అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే సినిమా ఒక కుటుంబ కథ చిత్రం అని అర్థం అవుతోంది. సినిమా మొత్తం కూడా అలాగే సాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పండగకి విడుదల అయిన సినిమాలు అన్నీ కూడా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలుగా రూపొందించబడ్డాయి.

kalyanam kamaneeyam movie review

వాటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా చాలా సింపుల్ గా ఒక మంచి ఫ్లోలో సాగిపోతుంది. సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. సినిమాలో చూపించడానికి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. తెరపై ఎమోషన్స్ కూడా చాలా సహజంగా చూపించారు. కానీ కొన్ని ఎపిసోడ్స్ విషయంలో మాత్రం సాగదీయకుండా ఇంకా కొంచెం జాగ్రత్తగా తీసి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

kalyanam kamaneeyam movie review

ప్లస్ పాయింట్స్:

 • నటీనటులు
 • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
 • ఎమోషనల్ సీన్స్
 • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

 • అక్కడక్కడా ల్యాగ్ అయిన స్క్రీన్ ప్లే
 • సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్:

పండగకి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చూసి కొంచెం డిఫరెంట్ గా ఏదైనా సినిమా చూద్దాం అని అనుకునే వారికి, సింపుల్ స్టోరీతో సరదాగా అలా సాగిపోయే మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా చూద్దాం అనుకునే వారికి కళ్యాణం కమనీయం సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :