శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవిల కాంబోలో వచ్చిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా గత ఏప్రిల్ లోనే విడుదల చేయాల్సి ఉండగా కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటం, ఏపీలో టికెట్ వ్యవహారం, మొదలగు కారణాల వలన చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది.

Video Advertisement

మొత్తానికి.. రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Also Read:  బింబిసార సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే ? ఈ క్యూట్ పాప బ్యాక్ గ్రౌండ్ ఇదే !

అందుకు తగ్గట్లే రిజల్ట్ కూడా వచ్చింది. సినిమా బాగా ఆకట్టుకోవడంతో పాటు.. ఓటిటి లో రిలీజ్ అయిన తరువాత కూడా మంచి ఫలితాన్ని సాధించింది. ఈ సినిమా విజయం సాధించడానికి పాటలు కూడా ఒక ముఖ్యపాత్ర పోషించాయి. ఇందులో సారంగ దరియ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటలో సాయి పల్లవి డ్యాన్స్‌తో పాటు పక్కా ఉన్న డాన్సర్స్ డాన్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలా సాయి పల్లవి పక్కన డ్యాన్స్ చేసారు సంజన.

Also Read:   “ఆది” సినిమాకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా.? అసలు “వినాయక్” తీయాలనుకున్న కథ ఏంటంటే.?

saranga dariya background dancer sanjana gangurde

అలా సాయిపల్లవి పక్కన డ్యాన్స్ చేసారు సంజన గంగుర్దే. సంజన ఒక శిక్షణ పొందిన డ్యాన్సర్ అలాగే కొరియోగ్రాఫర్ కుడా. ఎన్నో సినిమాలకి సంజన పని చేసారు. సంజన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద, హీరో గోపీచంద్, అలాగే ఇంకా ఎంతోమంది ప్రముఖులతో ఉన్న ఫోటోలని సంజన షేర్ చేసారు.

watch video: