100M రికార్డ్ సృష్టించిన “సారంగా దారియా” ఇప్పటిది కాదంట…1952 లోనే ఆ పుస్తకంలో..? ఇదిగో సాక్ష్యం.!

100M రికార్డ్ సృష్టించిన “సారంగా దారియా” ఇప్పటిది కాదంట…1952 లోనే ఆ పుస్తకంలో..? ఇదిగో సాక్ష్యం.!

by Megha Varna

Ads

“దాని కుడీ భుజం మీద కడవా…
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా..”

Video Advertisement

ఈ పాట ఎంత ట్రెండ్ అయ్యిందో అంత కాంట్రవర్సీకి కూడా గురైంది. చిత్రంలో ఈ పాటను మంగ్లీతో పాడించి హిట్ కొట్టారు. ఈ పాట నాది అంటూ “కోమలి” వెలుగులోకి వచ్చారు. టీవీలో ఎన్నో చర్చలు కూడా జరిగాయి. ఆ పాటకు అర్ధం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఎన్నో ఆర్టికల్స్ కూడా కనిపించాయి. ఇప్పుడు తాజాగా వాట్సాప్ లో మరో ఫోటో వైరల్ అవుతుంది. సారంగదారియా పాట 1952 లోనే తెలంగాణ ప‌ల్లె పాటలు అనే పుస్త‌కంలో అచ్చయ్యింది అనే విషయం వెలుగులోకి వచ్చింది..

టీవీ 9 కథనం ప్రకారం…. కుడి భుజం మీద కడువ అనే జానపద పాటను బిరుద‌రాజు రామ‌రాజు అనే ర‌చ‌యిత రచించారు. 1952లోనే న‌ల్ల‌గొండ జిల్లా న‌కిరేక‌ల్లులో పాపయ్య, భద్రయ్య, లింగయ్య తదితరులు పాడుతుంటే నేను విన్నాను అని ఆ రచయిత ఈ పుస్తకంలో ప్రస్తావించారు కూడా… అయితే ప్రస్తుతం సినిమాలో ఉన్న పాటలోని లిరిక్స్ కి ఈ ఒరిజినల్ లిరిక్స్ కి చాలావరకు తేడా ఉంది. ఆ పుస్తకంలోని ఈ పాట ఉన్న పేజీ ఓ లుక్ వేయండి.

Also read: SARANGA DARIYA SONG LYRICS IN TELUGU

ఒక సినిమా హిట్ అవ్వాలంటే సినిమాలో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉండాలి. కథ, పర్ఫామెన్స్, ఫైట్స్, డైలాగ్స్ తో పాటు ఒక సినిమాకి మ్యూజిక్ కూడా ఎంతో ఇంపార్టెంట్. ఏదైనా ఒక సినిమా హిట్ అయిన తర్వాత మహా అయితే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ సినిమాని గుర్తుంచుకుంటారు. తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడతారు. కానీ ఆ సినిమాలో పాటలు మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా సరే వినిపిస్తూనే ఉంటాయి.

ఇప్పటికి కూడా ఎప్పుడో 30, 40 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాలలోని పాటలు మనం రెగ్యులర్ గా ఏదో ఒక షోలో వింటూనే ఉంటాం. అలా విన్న తర్వాత పాట ఏ సినిమాలోది అని యూట్యూబ్ లోకి వెళ్లి సర్చ్ చేసే వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు. అందుకే సినిమాకి పాటలు అంత ముఖ్యం. ఇంకా పాటల పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ కూడా పాట హిట్ అవ్వడానికి ఇంకొక ప్లస్ అవుతాయి. ఎన్నో సినిమాల్లో ఇలా ట్యూన్, పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ అన్నీ బాగున్న పాటలు ఉంటాయి. అంతకు ముందు అంటే యూట్యూబ్ అంత పాపులర్ కాదు కాబట్టి ఆ పాటల రీచ్ ఎక్కువగా ఉండేది కాదు.

కానీ ఇప్పుడు యూట్యూబ్ ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది కాబట్టి ఏదైనా ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన పాటలు కేవలం ఒక్క రీజియన్ కి మాత్రమే కాకుండా వేరే ప్రాంతాలకు కూడా రీచ్ అవుతున్నాయి. మన ఇండస్ట్రీలో కూడా ఎన్నో పాటలను ఈ ప్రపంచంలో ఉన్న ఎంతో మంది చూశారు. దానివల్ల యూట్యూబ్ లో ఆ పాటకి ఎన్నో మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఫిదా సినిమాలో వచ్చిండే పాట, ఈ పాటకి 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంసీఏ సినిమా లోని ఏవండోయ్ నాని గారు పాటకి కూడా 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంక రౌడీ బేబీ పాటకైతే ఏకంగా బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా బుట్ట బొమ్మ, రాములో రాముల ఇంకా ఎన్నో పాటలకి వ్యూస్ 100 మిలియన్ దాటాయి.

Singer-Mangli-Photos

Singer-Mangli-Photos

 

మొదట చెప్పిన మూడు పాటల్లో ఉన్న ఒక కామన్ పాయింట్ ఈపాటికే మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. తనే సాయి పల్లవి. సాయి పల్లవి డాన్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట లిరికల్ వీడియో ఫిబ్రవరి 28వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాకి పవన్ సిహెచ్ సంగీతం అందించారు. పవన్ అంతకుముందు బిగిల్ ఇంకా దిల్ బేచారా సినిమాలకి రెహమాన్ తో పని చేశారు.

 

సారంగ దరియా పాటని మంగ్లీ పాడారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. పాట చాలా క్యాచీగా ఉండటంతో, ట్యూన్ ఇంకా లిరికల్ వీడియోలో కనిపించిన స్టెప్స్ ప్రేక్షకులని ఆకర్షించాయి. అందుకే విడుదలైన కొంచంసేపటికే ఈ పాట ట్రెండింగ్ కి వచ్చేసింది.

watch video:


End of Article

You may also like