కొన్ని సినిమాలు ముందు నుంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయితే కొన్ని సినిమాలు మాత్రం ట్రోల్స్ లేదా  మీమ్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువవుతాయి. అదేవిధంగా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ది శరవణ స్టోర్స్ యజమాని అరుళ్ శరవణన్ హీరోగా నటించిన ‘ది లెజెండ్’ సినిమా కూడా ఎక్కువగా ట్రోల్ మెటీరియల్ లాగానే ప్రేక్షకులందరికీ పరిచయమైంది.

Video Advertisement

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నీ నెగటివ్ కామెంట్స్ మధ్య కూడా ఇప్పుడు ఈ చిత్రానికి పాసిటివ్ టాక్ రావడం విశేషం. ఈ సినిమాలో హీరోగా నటించిన అరుల్ శరవణన్ తమిళనాడు వ్యాప్తంగా ఉన్న శరవణన్ స్టోర్స్ యజమానిగా అందరికీ సుపరిచితమే. ఆయన హీరోగా సినిమా చేస్తున్నాడంటేనే విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

అందుకు దగ్గట్టే ఈ సినిమాలో ఆయన నటన కూడా అలాగే అనిపించింది. అయితే ఇందులో హీరోయిన్ గా చేసిన ఊర్వశి రౌతేలా నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఊర్వశి రౌతేలా నటన గురించి ఆడియన్స్ నుంచి సానుకూల స్పందన వస్తుంది. ఊర్వశి నటి మరియు మోడల్. అనేక అందాల పోటీ కిరీటాలను కూడా గెల్చుకుంది ఊర్వశి. ది లెజెండ్ ఊర్వశి తమిళ తొలి బహుభాషా చిత్రం.

అయితే ఈ సినిమాలో తన పాత్రకు గానూ ఊర్వశి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా..? ఊర్వశి ‘ది లెజెండ్’ కోసం రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందట! ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ని రావడంతో ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీలో ఊర్వశి అద్భుతంగా కనిపిస్తుందని, డాన్స్ తో అభిమానులను ఆకట్టుకుందని అంటున్నారు.

legend saravanan rejected ott offers for his movie..

ఊర్వశి తర్వాత దిల్ హై గ్రేలో కనిపించనుంది. సుసి గణేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో నటి అక్షయ్ ఒబెరాయ్ మరియు వినీత్ కుమార్ సింగ్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. సోషల్ మీడియాలో ఒక అమాయకుడిని ట్రాప్ చేసినందుకు ఒక కుర్రాడిని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఇన్‌స్పెక్టర్ కథే ఈ సినిమా.