లైఫ్ అఫ్ రామ్. ఈ పాట గుర్తు చేసుకుంటే మనలో చాలా మందికి గుర్తొచ్చే వ్యక్తి యశస్వి కొండేపూడి. ఈ పాట ద్వారా ఒక్క రోజులో చాలా పాపులర్ అయ్యారు యశస్వి. అప్పటి వరకు ఈ పాటని చాలా మంది వినే ఉంటారు కానీ, యశస్వి పాడిన తర్వాత పాట వినే ప్రేక్షకులు ఇంకా ఎక్కువ అయ్యారు. అంత మంచి పాట పాడిన యశస్వికి పాపులారిటీ రావడంతో పాటు ఆ పాట కూడా జనాల్లో ఇంకా పాపులర్ అయింది.

మనందరికీ యశస్వి కేవలం ఈ ఒక్క పాట ద్వారానే ఫేమస్ అయి ఉండొచ్చు. కానీ ఇంత దూరం రావడానికి ఎంతో కష్టపడ్డారు యశస్వి. యశస్వి కాకినాడ నుండి వచ్చారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్నారు. చదువుకునేటప్పుడే YK అనే బ్యాండ్ కూడా మొదలుపెట్టారు యశస్వి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు.


source : Instagram (@januhindusthani)
అంతే కాకుండా ఒక ఇంటర్వ్యూలో ఇంకా చాలా మంది సెలబ్రిటీలు తనని అభినందించారు అని, అలాగే కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయని యశస్వి చెప్పారు. యశస్వి గర్ల్ ఫ్రెండ్ పేరు శ్రీ ఝాన్సీ మునగళ్ల. వీరిద్దరూ 2009 నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఏడవ తరగతి చదువుతున్నప్పుడు యశస్వి ప్రపోజ్ చేశారు. వాళ్లు ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు శ్రీ ఝాన్సీ, యశస్వి ప్రేమని ఒప్పుకున్నారట.

source : Instagram (@yasaswikondepudi_official)
శ్రీ ఝాన్సీ తన ప్రేమని ఒప్పుకున్న రోజుని చేతిపై టాటూ లాగా వేయించుకున్నారు యశస్వి. ఈ విషయాన్ని ఇటీవల జీ తెలుగు లో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రోగ్రాం లో యశస్వి చెప్పారు. ఈ ప్రోగ్రాం కి శ్రీ ఝాన్సీ కూడా వచ్చారు. శ్రీ ఝాన్సీ ఫార్మ్.డి చదువుతున్నారు. అంతే కాకుండా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.
watch video:
Also watch:
https://youtu.be/VsSQWWngYKc?t=369
