ఏంటి “తమన్” అన్నా..? “కళావతి” పాట కూడా కాపీయేనా..? ఈసారి ఏ పాట నుండి అంటే.?

ఏంటి “తమన్” అన్నా..? “కళావతి” పాట కూడా కాపీయేనా..? ఈసారి ఏ పాట నుండి అంటే.?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14న విడుదల అవ్వబోతోంది.

Video Advertisement

ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు. అయితే సినిమాలో కళావతి పాట ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ కనిపిస్తున్నారు. ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు.

sarkaru vaari paata kalaavathi copied from a recent telugu hit song

ఈ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దానికి కారణం ఈ పాట అంతకుముందు తమన్ స్వరపరిచిన ఒక పాటకి దగ్గరగా ఉండటమే. ఈ పాట ప్రోమోలో ఉన్న ట్యూన్ చూస్తే అంతకుముందు తమన్ కంపోజ్ చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో ఇది నేనేనా పాటలాగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. కొంతమందేమో, “పాట మొత్తం విడుదల అవ్వలేదు. అలాంటప్పుడు రెండు పాటలు దగ్గరగా ఉన్నాయి అని ఎలా అనుకుంటారు?” అని అంటున్నారు. ఏదేమైనా పాట మొత్తం విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే. ఇంక సినిమా విషయానికొస్తే, సర్కారు వారి పాట విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది.

common point in these 3 mahesh babu movies

ఇప్పుడు మేలో విడుదల అవ్వబోతోంది. షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయినట్టు సమాచారం. తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వం వహించబోతున్న సినిమాలో కూడా నటిస్తారు. ఇది పాన్ ఇండియన్ సినిమా గా విడుదల అవుతుంది. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల క్రితం సినిమా చేయాల్సి ఉంది. కానీ వేరే సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల అది లేట్ అయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన కథ పనులు విజయేంద్ర ప్రసాద్ మొదలుపెట్టినట్లు సమాచారం.

watch video :

https://www.youtube.com/watch?v=z6rHcAy9qRA


End of Article

You may also like