ఇలా దొరికిపోయావేంటి తమన్ అన్నా..! “సర్కారు వారి పాట” ట్రైలర్‌లో ఈ ట్యూన్ కూడా కాపీయేనా..?

ఇలా దొరికిపోయావేంటి తమన్ అన్నా..! “సర్కారు వారి పాట” ట్రైలర్‌లో ఈ ట్యూన్ కూడా కాపీయేనా..?

by Anudeep

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలోని రెండు పాటలు ఇటీవల విడుదల అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల అయ్యింది.

Video Advertisement

గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

sarkaru vaari paata surprise update

ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు లుక్ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో సినిమాకి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో వస్తున్న ట్యూన్ చాలా మందికి ఎక్కడో విన్నట్లే అనిపిస్తూ ఉంది.

జాగ్రత్తగా గమనిస్తే ఈ సినిమా “కత్తి” సినిమా లోది. ఇది తెలుగు డబ్ సినిమా. తమిళ్ హీరో ఇళయదళపతి విజయ్, సమంత హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో “ఆతి..” అంటూ సాగే పాటలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ట్యూన్ ని కాపీ చేసినట్లు ఉన్నారు. ఈ ట్యూన్, “సర్కారు వారి పాట” సినిమాలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్యూన్ ఒకేలా ఉన్నాయి. దీనితో నెటిజన్స్ మళ్ళీ తమన్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

Watch Video:

https://youtu.be/-U8KVChK5ro


End of Article

You may also like