తన భూమిలో “ఆకుకూరలు” పండించి అమ్ముతున్న “సర్పంచ్”… సెల్యూట్ చేస్తున్న జనం.

తన భూమిలో “ఆకుకూరలు” పండించి అమ్ముతున్న “సర్పంచ్”… సెల్యూట్ చేస్తున్న జనం.

by Anudeep

ఏదైనా ఊరికి సర్పంచ్ అంటే.. వారు ఎంత దర్జాగా ఉంటారో మనందరికీ తెలిసిందే. కానీ, ఈ సర్పంచ్ అలా కాదు. ఊరికి పెద్దనే అయినా.. నా ఉపాధి నేను చూసుకోవడం లో తప్పు లేదని ఆమె భావిస్తోంది. కూరలను పండించి జిల్లా కేంద్రం లో వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతోంది. ఆమె ఎవరో.. ఆమె కథ ఏమిటో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

Video Advertisement

surpanch feature

ఆమె పేరు గుగులోతు లక్ష్మి రామ చంద్రు. మహబూబాబాద్‌ జిల్లా రేగడి తండా గ్రామ పంచాయతీ కి ఆమె ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. చెప్పుకోవడానికి సర్పంచ్ అయినా.. ఆమె తన జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. తన కు ఉన్న భూమిలో కాయగూరలు పండించి వాటిని జిల్లా కేంద్రం లో విక్రయించుకుంటున్నారు. కరోనా వచ్చాక పరిస్థితిలు మరింత అధ్వాన్నం గా తయారయ్యాయి. ఇటీవలే లాక్ డౌన్ టైం లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన యువతీ కూడా కూరల వ్యాపారం చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. నిత్యావసరాల ధరలు పెరగడం.. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుండడం తో.. ఆమె తన జీవనోపాధి కోసం ఇలా కష్టపడుతున్నారు.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందరికి ఇబ్బందికరం గా ఉన్నవే. మరో వైపు పెట్రోల్ ఖర్చులు కూడా ఎక్కువ గానే ఉన్నాయి. ఈ క్రమం లో ప్రభుత్వం నుంచి వచ్చే జీతం ఆమె పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదట. అందుకే ఉపాధి కోసం ఆమె కూరల వ్యాపారం వైపు మొగ్గు చూపారట. అక్రమాలకు పాల్పడకుండా.. తనకు తోచింది ఎదో తానూ చేసుకుంటూ సర్పంచ్ అయినప్పటికీ.. సామాన్యురాలి గా జీవనం వెళ్లదీస్తున్న లక్ష్మి అందరికి ఆదర్శం గా నిలుస్తున్నారు. మన పని మనం చేసుకుంటే తప్పేముంది అంటూ.. ఆమె తన వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆమె గురించి తెలిసిన అందరు ఆమె ను అభినందిస్తున్నారు.


You may also like