విలన్ కి కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి…! ఎందుకో తెలుసా?

విలన్ కి కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి…! ఎందుకో తెలుసా?

by Mounika Singaluri

మెగాస్టార్ చిరంజీవి మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడుగా ఎంత పేరు సంపాదించారో అలాగే మంచి క్యారెక్టర్ తో చిరంజీవి అంతకన్నా ఎక్కువ పేరు సంపాదించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆర్థిక సహాయాలు చేశారు. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇదే విధంగా చిరంజీవి ఒక విలన్ కి కారు కొనిచ్చారట. రేపిస్టుగా ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న అతనికి చిరంజీవి కారు కొనివ్వడం వెనకాల ఉన్న స్టోరీ గురించి చూస్తే…

Video Advertisement

ప్రముఖు నటుడు సత్య ప్రకాష్ విలన్ గా తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలో రేపిస్టు క్యారెక్టర్లు చేయాలంటే సత్య ప్రకాష్ తప్పితే ఎవరూ చేయలేరు అన్నంతగా తన పెర్ఫార్మెన్స్ ఉండేది. అన్ని భాషల్లో కలిపి సత్య ప్రకాష్ 500 పైగా సినిమాల్లో నటించాడు. ఈ మధ్య సినిమాలు తగ్గిన సత్య ప్రకాష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు… ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు….!

తనని చిరంజీవికి సౌందర్య ఒక సినిమా షూటింగ్ లో పరిచయం చేసిందట. తాను నటిస్తున్న సినిమా పక్కనే చిరంజీవి సౌందర్య సినిమా షూటింగ్ జరుగుతుందట. అప్పుడు సౌందర్య తీసుకువెళ్లి చిరంజీవికి తన గురించి చెప్పిందట. తన జీవితంలో ఒకే ఒక్కసారి రేప్ కు గురయ్యారని అది చేసింది ఈ దుర్మార్గుడే అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చిందట. దాంతో చిరంజీవి కూడా బాగా నవ్వారట. చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో నటించే సమయంలో ఒక రాత్రి షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు చిరంజీవి సత్య ప్రకాష్ ని చూశారట. మరుసటి రోజు పిలిచి నువ్వు ఇంటికి ఎలా వెళ్తున్నావు అని అడిగితే బైక్ పై వెళ్తున్నాను అని చెప్పాడట.

హెల్మెట్ పెట్టుకుంటున్నావా అని అడగగా లేదని సమాధానం చెప్పాడట. నువ్వు చాలా మంచి నటుడివి, ఇండస్ట్రీకి నువ్వు అవసరము… నీ కుటుంబానికి కూడా నువ్వే పెద్దదిక్కు రేపటి నుంచి నువ్వు బైక్ పై వెళ్లొద్దు అంటూ ఒక కారు కొనిచ్చారట. చిరంజీవి కారు కొనివ్వడంతో సత్య ప్రకాష్ ఆశ్చర్యానికి లోనయ్యారట. తాను తర్వాత ఎన్ని కార్లు కొనుక్కున్నప్పటికీ చిరంజీవి కారు ఇచ్చిన ఫీలింగ్ మళ్ళీ రాలేదని ఆ కారు తనకి ఎప్పటికీ తీపి గుర్తు అని సత్య ప్రకాష్ చెప్పుకొచ్చాడు.


You may also like

Leave a Comment