సత్యభామ సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

సత్యభామ సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

Ads

మధ్యలో కొంత కాలం విరామం తీసుకున్న తర్వాత, మళ్లీ కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ పోలీస్ పాత్రలో నటించడం ఇది మొదటిసారి కాదు. విజయ్ హీరోగా నటించిన జిల్లా సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ పోలీస్ పాత్రలో నటించారు. కానీ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ సినిమా కోసం కాజల్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

Video Advertisement

satyabhama censor talk

చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కాజల్ నటిస్తున్న సినిమా ఇదే అవ్వడంతో, భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమా ట్రైలర్ కూడా ఆసక్తిని ఇంకా పెంచింది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బృందం యు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 14 నిమిషాలుగా ఈ సినిమా రన్ టైం ఉన్నట్టు చెప్పారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది తక్కువ రన్ టైం. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు సెన్సార్ బృందం తెలిపారు అనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో కాజల్ చాలా బాగా నటించారు అని అంటున్నారు. కాజల్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది అని ఈ సెన్సార్ బృందం వాళ్ళు సినిమా చూసి చెప్పినట్టు సమాచారం.

సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఆడవారి మీద జరిగే విషయాల మీద ఈ సినిమా నడుస్తున్నట్టు తెలుస్తోంది. కాజల్ ఈ సినిమా కోసం పోరాటాలు కూడా చేశారు. సినిమాలో సీన్స్ బాగా రావడం కోసం సినిమా బృందం అంతా ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని కాజల్ ఇంటర్వ్యూలలో చెప్తుంటే, ఒక సీన్ సరిగ్గా రావడానికి ఇంత కష్టం ఉంటుందా అని అనిపించింది. సుమన్ చిక్కల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, గూడచారి వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ప్రస్తుతం సినిమా బృందం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.


End of Article

You may also like