Ads
- చిత్రం: గాడ్సే
- నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ, జియా శర్మ, తనికెళ్ళ భరణి,నాగబాబు కొణిదెల, బ్రహ్మజీ
- నిర్మాత: సి. కళ్యాణ్
- దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి
- సంగీతం: శాండీ అద్దంకి
- విడుదల తేదీ: జూన్ 17, 2022
Video Advertisement
స్టోరీ:
ఇండియాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థపై ఓ సామాన్య యువకుడు చేసే పోరాటం నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు గోపి గణేష్. ఈ సినిమాను ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా రూపొందించినట్లు చిత్ర యూనిట్ ఇదివరకే వెల్లడించింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చింది.
రివ్యూ:
తెలుగు చిత్ర పరిశ్రమ టాలెంట్ ఉన్న నటులకి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. నటుడిలో టాలెంట్ ఉంటే చాలు విజయాలు వాటంతట అవే పలకరిస్తాయి. తెలుగు తెరకి అలా సహాయ నటుడిగా పరిచయం అయ్యి హీరోగా మారి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్య దేవ్. చాలా సినిమా లో చిన్న చిన్న వేషాలు వేసినప్పటికి, పూరి జగన్నాధ్ జ్యోతి లక్ష్మి, క్షణం సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల రామ్ ఇస్మార్ట్ శంకర్ లో హీరో స్ధాయిలో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ చేసాడు. ఇటీవల తాను హీరో గా నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, తిమ్మరుసు సినిమాల సక్సెస్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు గాడ్సేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సత్య దేవ్.
సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం చాలా మంది ప్రముఖులను హీరో అంతమొందించే సన్నివేశాలతో ఆసక్తికరంగా చూపించాడు. ఇందులో ఇంటర్వెల్ మరింత హైలైట్‌గా ఉంటుంది. అయితే, సెకెండాఫ్ మాత్రం గత సినిమాలను గుర్తు చేసే సన్నివేశాలతో సాగుతుంది. క్లైమాక్స్ కూడా పర్వాలేదనిపించేలా ఉంది.
ప్లస్ పాయింట్స్:
- బ్యాగ్రౌండ్ స్కోర్,
- యాక్షన్ ఎపిసోడ్స్,
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
రేటింగ్:
2.5/5
టాగ్ లైన్:
సందేశాత్మక చిత్రాలు చూసే వారిని గాడ్సే తప్పక మెప్పిస్తాడు.
End of Article