• చిత్రం : గుర్తుందా సీతాకాలం
 • నటీనటులు : సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి.
 • నిర్మాత : భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి (నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్)
 • దర్శకత్వం : నాగశేఖర్. ఆర్
 • సంగీతం : కాల భైరవ
 • విడుదల తేదీ : డిసెంబర్ 9, 2022

gurtunda seetakalam review

Video Advertisement

 

స్టోరీ :

సినిమాలో రెండు ప్రేమ కథలు ఉంటాయి. సత్యదేవ్ చదువుకుంటున్న వయసులో ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు తమన్నాతో స్నేహం పెరుగుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏమయ్యింది? వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఈ కథ మొత్తం సత్యదేవ్ మరొకరికి ఎందుకు చెప్తున్నారు? అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా విడిపోతారా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

gurtunda seetakalam review

రివ్యూ :

సత్యదేవ్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలని ఎంచుకుంటారు అని గుర్తింపు ఉంది. సత్యదేవ్ ఇలాంటి సినిమా అంతకుముందు చేయలేదు. సినిమా ట్రైలర్ చూస్తే ఇది లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది. సాధారణంగా ఇలాంటి లవ్ స్టోరీస్ అంతకు ముందు మనం చాలా చూశాం. కానీ ప్రజెంట్ చేయడంలో ఆ డైరెక్టర్ టేకింగ్ వల్ల సినిమా అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీ పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.

gurtunda seetakalam review

కానీ ఇటీవల వచ్చిన కాలంలో ఫీల్ గుడ్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది. చూసినంత సేపు కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నారు. రీమేక్ సినిమా అయినా సరే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. రీమేక్ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా అందుకు తక్కువగా లేదు. కానీ కొన్ని సీన్స్ మాత్రం సాగదీసినట్టు అనిపిస్తాయి.

gurtunda seetakalam review

ప్లస్ పాయింట్స్ :

 • ఎంచుకున్న పాయింట్
 • లొకేషన్స్
 • మ్యూజిక్
 • నటీనటులు

మైనస్ పాయింట్స్:

 • ఎక్కడో చూసినట్టుగా ఉండే కొని సీన్స్
 • సాగదీసినట్టుగా అనిపించే కొన్ని ఎపిసోడ్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఎటువంటి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఈ సినిమా ఎవరిని నిరాశపరచదు. ఇటీవల వచ్చిన ఫీల్ గుడ్ సినిమాల్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా గుర్తుండే సీతాకాలం సినిమా నిలుస్తుంది.