ప్రముఖ చెఫ్ …స్టార్ట్ ప్లస్ ఛానెల్ లో వొచ్చే వంటల ప్రోగ్రాం “మాస్టర్ చెఫ్” జడ్జి అయిన వికాస్ ఖన్నా తన ట్విట్టర్ లో …ఒక ఫోటో పోస్ట్ చేస్తూ ఈయన దిబ్బ రొట్టెలు ఎలా చెయ్యాలో నాకు నేర్పిన గురువు గారు పేరు సత్యం ..ఓ యూట్యూబ్ ఛానల్ లో ఈయన వీడియో చూసి నేను దిబ్బ రొట్టెలను తయారు చేయడం నేర్చుకున్నాను …ఈ ఆపత్కాలంలో అయన ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అని తెలుసుకొని ఏదైనా సహాయం చేయాలనుంది …అతని అడ్రెస్స్ కనుక్కోండి అని తెలిపాడు.

Video Advertisement

అతను అలా పోస్ట్ చేసిన 72 గంటల్లో సత్యం అడ్రెస్స్ ను వికాస్ కు తెలియజేసారు అయన ఫాలోవర్స్ . పశ్చిమ గోదావరి ,పాలకొల్లు లు ఉన్న ఆయనకు నిత్యావసర సరుకులను పంపించాడు . యూట్యూబ్ ద్వారా నేర్చుకొని ఆయనను గురువు గా భావించి …..ఇలాంటి సమయంలో ఆదుకోవడం నిజంగా అభినందనీయం.!