Tenant Review : “సత్యం రాజేష్” హీరోగా నటించిన ఈ సినిమా అలరించిందా..?

Tenant Review : “సత్యం రాజేష్” హీరోగా నటించిన ఈ సినిమా అలరించిందా..?

by Harika

Ads

సత్యం రాజేష్ హీరోగా నటించిన ఒక కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా పేరు టెనెంట్. యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని, మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. మేఘ చౌదరి, భరత్ కాంత్, చందన, ఆడుకలం నరేన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. జెమిన్ జోమ్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 19వ తేదీన విడుదల అయిన ఈ సినిమా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, గౌతమ్ (సత్యం రాజేష్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఉంటాడు.

Video Advertisement

satyam rajesh tenant amazon prime review telugu

గౌతమ్ కి అతని మరదలు సంధ్య (మేఘ చౌదరి) తో పెళ్లి అవుతుంది. అదే అపార్ట్మెంట్ లో పక్క ఫ్లాట్ లో తన స్నేహితులతో కలిసి, రిషి (భరత్ కాంత్) ఉంటాడు. రిషి, శ్రావణి (చందన) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా కూడా, రిషి ముందు తాను సెటిల్ అవ్వాలి అని ఆపుతూ ఉంటాడు. మరొక పక్క సంధ్య ప్రవర్తనలో మార్పు వస్తుంది. గౌతమ్ తో కూడా సరిగ్గా మాట్లాడదు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. కథ మొత్తం తక్కువ లొకేషన్స్ లో జరుగుతుంది. కానీ కథ చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. అంతే గ్రిప్పింగ్ గా తెర మీద చూపించారు. టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది.

కొన్ని చోట్ల మాత్రం సినిమా ఫ్లాట్ గా నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకా బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎంత ఆసక్తికరంగా ఉంటే సినిమా అంత బాగుంటుంది. ఈ సినిమాలో ఇన్వెస్టిగేట్ చేసే సీన్స్ సాధారణంగా అనిపిస్తాయి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ కూడా బలం లేనట్టుగా అనిపిస్తాయి. వాటి విషయంలో కూడా ఇంకా జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎక్కువగా అంచనాలు లేకుండా చూస్తే టెనెంట్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.


End of Article

You may also like