Ads
జీవితం అందరికీ సులభంగా ఉండదు. కొన్ని సంఘటనల వల్ల, వారి ఆలోచన విధానం మారి, వారిని ఇంకా బలంగా తయారు చేసి, వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరేలాగా చేస్తాయి. ఈ ఐఏఎస్ అధికారి జీవితంలో ఇలాగే జరిగింది. సవిత ప్రధాన్. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ డివిజన్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈమె జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. సవిత మధ్యప్రదేశ్‌లోని మండై గ్రామంలో గిరిజన కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల చదువుకి సమస్య అయ్యేది. కానీ స్కాలర్‌షిప్ తెచ్చుకొని సవిత తన తల్లిదండ్రులని తన చదువుకి ఒప్పించారు.
Video Advertisement
వాళ్ల ఊరిలో పదవ తరగతి పూర్తి చేసిన మొదటి అమ్మాయిగా సవిత నిలిచారు. తన ఊరి నుండి 7 కిలో మీటర్లు దూరంగా ఉన్న స్కూల్ లో సవిత కి అడ్మిషన్ వచ్చింది. అక్కడ వారికి ప్లస్ 2 ఉంటుంది కాబట్టి స్కూల్ లోనే చదువుకోవాలి. ఒక్కసారి స్కూల్ వరకు వెళ్లాలి అంటే 2 రూపాయలు ఖర్చు అయ్యేవి. అవి చాలా ఎక్కువ. అందుకే సవిత తల్లి ఒక చిన్న ఉద్యోగం చూసుకొని, సవిత చదువుకునే చోటుకి దగ్గరగా ఉండేవాళ్లు. సవితకి సైన్స్ అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలి అని అనుకునేవారు. సవిత కి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సంబంధం వచ్చింది.
సవిత భర్త సవిత కంటే 11 సంవత్సరాలు పెద్దవారు. పెళ్లిచూపుల్లోనే అతను దురుసుగా ప్రవర్తించారు. సవిత తనకి ఈ పెళ్లి వద్దు అని చెప్పినా కూడా, పెద్దింటి వాళ్ళ నుండి వచ్చిన సంబంధం అని సవితకు చెప్పి పెళ్లి చేశారు. ఆ తర్వాత సవిత అత్తారింటికి వెళ్లిన తర్వాత ఎన్నో నిబంధనలు పెట్టారు. అందరూ తిన్న తర్వాత సవిత తినాలి. ఒకవేళ తినడానికి ఏం లేకపోతే మళ్ళీ వంట వండుకోకూడదు. నలుగురిలో వెళ్లకూడదు. తల మీద ఉన్న కొంగు తీయకూడదు. ఎక్కువగా నవ్వకూడదు. టీవీ కూడా చూడకూడదు. ఒకవేళ ఈ నిబంధనలకు ఎదురు తిరిగితే సవిత తన భర్త చేతిలో తన్నులు తినాల్సి వచ్చేది.
ఒకసారి చనిపోదాం అనుకున్నప్పుడు సవితకి తాను గర్భవతి అని తెలిసింది. ఈ విషయాన్ని సవిత తన తల్లితో చెప్తే, బిడ్డ పుట్టాక పరిస్థితులు సర్దుకుంటాయి అని చెప్పారు. సవితకి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. అయినా కూడా పరిస్థితులు మామూలు అవ్వలేదు. సవితకి యజుష్, అథర్వ్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒకసారి ఉ-రి వేసుకోవడానికి చీరని ఫ్యాన్ కి బిగించి మెడకి చుట్టుకుంటున్నప్పుడు అక్కడ కిటికీ దగ్గర సవిత అత్తగారు, మామగారు చూస్తున్నారు. వాళ్లు సవితని ఆపడానికి ప్రయత్నించలేదు. దాంతో సవిత అలాంటి వాళ్ళ మధ్యలో ఉండకూడదు అనుకుని అక్కడి నుండి బయటికి వెళ్లిపోయారు.
అయినా కూడా సవిత భర్త సవిత ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కొట్టేవారు. అప్పుడు సవిత పోలీసులకు కంప్లైంట్ చేసి విడాకులు తీసుకున్నారు. హర్ష అనే ఒక వ్యక్తిని సవిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిమ్మత్ వాలి లడికియా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టారు. తన జీవితం గురించి అందులో చెప్తూ చాలా మందికి ధైర్యాన్ని ఇస్తున్నారు. సవిత ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు తన చేతిలో రెండు వేల రూపాయలు ఉన్నాయి. ఒక బ్యూటీ పార్లర్ లో అసిస్టెంట్ గా పని చేశారు. ఇంట్లో వంట పనులు చేయడంతో పాటు చిన్న పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్పేవారు.
ఇవన్నీ చేస్తూ బీఏ పరీక్షలు రాశారు. ఆ తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత సవిత తల్లి కూడా తనకు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఒకసారి యూపీఎస్సీ నోటిఫికేషన్ కనిపించడంతో అది చూసి సాధించాలి అనుకొని కష్టపడి చదివారు. 24 సంవత్సరాలకి చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అయ్యారు. సవిత జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే ఎక్కడా ధైర్యం కోల్పోకుండా ఆ కష్టాల నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద విజయం సాధించారు.
ALSO READ : హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి “కొంపెల్ల మాధవి లత” ఆస్తుల వివరాలు ఎంతో తెలుసా..?
End of Article