Ads
మన దేశం సంస్కృతికి పెట్టింది పేరు. ప్రపంచంలో ఎన్నో దేశాల నుండి ఎంతో మంది మన దేశాన్ని మన దేశంలో ఉన్న ప్రముఖ కట్టడాలని చూడడానికి వస్తూ ఉంటారు. ఒక రోజుకి మన దేశానికి ఎంతో మంది టూరిస్టులు వస్తారు. మనం ఏదైనా ఒక ప్రముఖ కట్టడం చూడడానికి వెళ్తే అక్కడ చాలా మంది విదేశీయులే ఉంటారు.
Video Advertisement
అయితే విదేశీయులకి మన దేశం గురించి ఎక్కువగా తెలియదు. ఈ విషయాన్ని గ్రహించిన కొంత మంది వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి ఉదాహరణ ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన. ఈ సంఘటన ఢిల్లీలో జరుగుతోంది. ఢిల్లీ చూడడానికి వచ్చిన టూరిస్ట్ కాలి మీద కుక్క పెంట పడుతుంది.
అంతలో అదే ప్రదేశానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఆ టూరిస్ట్ తో “మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఇది మీ తల మీద పడలేదు” అని చెప్పి, పక్కనే క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంది అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి టూరిస్ట్ షూ తీసుకొని ఆ షూ మీద ఉన్న కుక్క పెంట క్లీన్ చేస్తాడు. అలా క్లీన్ చేసినందుకు ఆ వ్యక్తి అడిగే మొత్తం 2,500 రూపాయలు.
దాంతో ఆ టూరిస్ట్ ని అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి “అతను కావాలనే ఎక్కువ అడుగుతున్నాడు. మీరు 900 కంటే ఎక్కువ ఇవ్వకండి” అని చెప్తాడు. చివరికి బేరమాడి క్లీన్ చేసినందుకు 800 రూపాయలు ఇచ్చేలా చేస్తారు. ఇలా ఢిల్లీ చూడడానికి వచ్చే ఎంతో మంది టూరిస్టులను ఇలాగే మోసం చేస్తారు. ఈసారి మీరు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.
watch video :
End of Article