అడివి శేష్ HIT 2 , డిసెంబర్ 2 న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచింది. సెన్సార్ బోర్డ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి A సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ రన్ టైం కేవలం రెండు గంటలు మాత్రమే.

Video Advertisement

ఈ మూవీ ట్రైలర్ నచ్చిన నాగార్జున “ట్రైలర్ చాలా ఆసక్తి కలిగించింది.. తప్పనిసరిగా ఈ సినిమా చూడాలని ఉంది”అని ట్వీట్ కూడా చేశారు. దాంతో ఇప్పుడు HIT 2 మీద అంచనాలు ఇంకా పెరిగాయి.

adivi sesh's hit 2 sensor talk out..!!

ఈ చిత్రంలో రావు రమేష్ ,శ్రీకాంత్ ,కోమలి ప్రసాద్ మొదలైన వాళ్లు ముఖ్యపాత్రలో నటించనున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్రం యూనిట్ భావిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ట్విస్టులతో రోమాంచిత సన్నివేశాలతో ఉత్కంఠత రేపుతుంది. సెకండ్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఇందులో నేరస్థుడు ఎవరు అనేది లాస్ట్ వరకు సస్పెన్స్ సాలిడ్ గా మెయింటైన్ చేశారు.

ఆఖరికి సెన్సార్ బోర్డు సభ్యులు సైతం ఈ మూవీ అసలు కిల్లర్ ఎవరో చూసి ఆశ్చర్యపోయారు. దాన్నిబట్టి ఈ మూవీలో సస్పెన్స్ ఏ రేంజ్ లో మెయింటైన్ చేశారో ఆలోచించండి. ఇక ఇందులో మెయిన్ ట్విస్ట్ రాబోతున్నది సీక్వెల్ కి కూడా ఈ మూవీలోని లాస్ట్ లో క్లూ ఇవ్వడం జరిగింది. మీరు బాగా గమనిస్తే దీనికి ముందు సీక్వెల్ హిట్ ఎండింగ్ లో గమనించినట్లయితే కేస్ మిస్టరీ సాల్వ్ అయ్యాక నేహా విక్రమ్ కి సంబంధించిన పాస్ట్ గురించి అడుగుతుంది. తర్వాత చెప్తాను అని దాటేసిన విక్రమ్ నేహాతో కలిసి కారు వద్దకు వస్తాడు.

విక్రమ్ కారు ఎక్కబోయే టైం కి ఎవరో అజ్ఞాత షూటర్ అతనిపై దాడి చేస్తాడు. విక్రమ్ సేఫ్ అనేది చూపిస్తారే తప్ప నేహ గురించి ఎండింగ్లో మనకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కారులో కూర్చున్న నేహ పరిస్థితి ఏమిటి? బుల్లెట్ ఆమెకు తగిలిందా లేదా? గురించి మనకు హిట్ : ద ఫస్ట్ కేస్ లో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే హిట్ 2 ట్రైలర్ లో హత్య చేసే వ్యక్తికి పన్ను మీద పన్ను ఉండి అని చెప్తారు. హిట్ ఎండింగ్ క్రెడిట్స్ లో ఒక వ్యక్తి ఫోటో చూపిస్తారు. ఆ వ్యక్తికి పన్నుమీద పన్ను ఉన్నట్టు కూడా చూపిస్తారు. ఈ విషయాన్ని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు రాబోతున్న దీని సీక్వెల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయని ఆశిద్దాం.