“ఇలాంటి సీన్ పెట్టడం అవసరమా..?” అంటూ… వైష్ణవ్ తేజ్ “ఆదికేశవ” ట్రైలర్‌పై కామెంట్స్..!

“ఇలాంటి సీన్ పెట్టడం అవసరమా..?” అంటూ… వైష్ణవ్ తేజ్ “ఆదికేశవ” ట్రైలర్‌పై కామెంట్స్..!

by Mounika Singaluri

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ట్రైలర్ తోటి పాటల తోటి బాగా హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ట్రైలర్ జనాల్లో ఎంత బాగా నానితే సినిమాకి అంత బాగా హైప్ పెరిగి సినిమాకి కలెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలా హైప్ క్రియేట్ చేయాలని మేకర్ చేసిన చాలా ప్రయత్నాలు ట్రోల్స్ కి కూడా గురైన సందర్భాలు ఉన్నాయి.

Video Advertisement

ఎంత ట్రోల్స్ వస్తే అంత మంచిదని మేకర్స్ కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ట్రోలర్స్ కి మంచి మెటీరియల్ కూడా అందిస్తున్నారు. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న చిత్రం ఆది కేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం లో ఇప్పటికే విడుదలైన పాటలు మంచి హైప్ వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల అయింది. సినిమా ట్రైలర్ అధ్యంతం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంది. మంచి కమర్షియల్ సినిమా అందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ లాస్ట్ లో వచ్చిన ఒక షాట్ మాత్రం ట్రోల్స్ కి గురి అవుతుంది. హీరో సుత్తితో రాయిని కొట్టగా మంట పక్కన ఉన్న రౌడీ బాడీ కి అంటుకుంటుంది. ఆ మంటల్లో హీరో సిగరెట్ అంటించుకుని కాలుస్తాడు.

scene from adikeshava trailer

కేజిఎఫ్ సినిమాలో హీరో గన్ నుండి సిగరెట్ అంటించుకున్నాడు కదా, దాని నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఎలా వస్తాయి స్వామి ఇలాంటి ఐడియాలు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కూడా ఇలాంటి సీనే బాగా ట్రోల్స్ కి గురైంది. ఏది ఏమైనా సినిమాకి ఇది ప్లస్ అయితే బానే ఉంటుంది.

Watch Trailer:

Also Read:యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతులమీదుగా రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో చేస్తున్న”సారంగాదరియా”మూవీ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల


End of Article

You may also like