సుహాస్ కొత్త సినిమాలో కులాల ప్రస్తావన..? కానీ ఎలా ఉండబోతోంది అంటే..?

సుహాస్ కొత్త సినిమాలో కులాల ప్రస్తావన..? కానీ ఎలా ఉండబోతోంది అంటే..?

by Mohana Priya

డిఫరెంట్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో సుహాస్. సహాయ పాత్రల్లో నటించడం తో కెరీర్ మొదలు పెట్టిన సుహాస్, తర్వాత కలర్ ఫోటో లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్లో, నటించి నేషనల్ అవార్డు అందుకున్న సినిమాలో నటించిన ఘనతని సాధించారు.

Video Advertisement

గత సంవత్సరం రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సుహాస్, ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ట్రైలర్ చాలా కొత్తగా అనిపిస్తోంది.

scene from ambajipeta marriage band trailer

శివాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి, దుష్యంత్ కాటికనేని దర్శకత్వం వహించారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని నిర్మించారు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా సినిమా బృందం మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకి సినిమా వాళ్ళు సమాధానం చెప్పారు. అయితే సినిమా ట్రైలర్ లో సుహాస్ తన జుట్టు తీయించుకోవడం చూపించారు. ఈ సీన్ గురించి దర్శకుడు మాట్లాడుతూ, సినిమా ఒక ఊరిలో జరిగే కథ కాబట్టి ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది అని, కానీ అది ఎవరిని కించపరిచేలాగా తీయలేదు అని చెప్పారు.

scene from ambajipeta marriage band trailer

సినిమా ఒక ప్రేమ కథ అయినా కూడా ఇందులో ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామా కూడా ఉంటుంది అని దర్శకుడు చెప్పారు. సుహాస్ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ, తను సినిమా కోసం రెండు సార్లు జుట్టు తీయించుకున్నాను అని చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ట్రైలర్ ఇప్పటికే అంచనాలను పెంచింది. ఈ సినిమాలో శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే రైటర్ పద్మభూషణ్ సినిమాకి చేసినట్టే, ఈ సినిమాకి కూడా ముందే ప్రీమియర్స్ ఉంటాయి అని సమాచారం. ప్రస్తుతం సినిమా బృందం అంతా ప్రమోషన్స్ పనిలో ఉంది. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.

watch video :

ALSO READ : FIGHTER REVIEW : “హృతిక్ రోషన్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


You may also like

Leave a Comment