Ads
ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీలోని మిస్టేక్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసే చిత్రాలంటే ఎలా ఉంటాయో ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ ఒక అవగాహన ఉంది. సినిమాలలో లాజిక్ ఉండడం మామూలే కానీ, బోయపాటి సినిమాలలో లాజిక్ అతిగా ఉంటుందనే టాక్ ఉంది. కథ, క్యారెక్టర్లు, సీన్స్, ఇలా అన్నిటిలో లాజిక్స్ ఉండవని అంటారు. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ అయితే మరీ విడ్డూరంగా ఉంటాయని అంటారు.స్కంద సినిమాలో ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని పూర్తి మాస్ పాత్రలో నటించారు.
ఇంతకు ముందు రామ్ మాస్ పాత్రలలో నటించారు. ఇస్మార్ట్ శంకర్ లో మాస్ రోల్ చేశారు. అయితే ‘స్కంద’ లో నెక్స్ట్ లెవల్ మాస్ క్యారెక్టర్ చేశారని టాక్. అయితే స్కంద మూవీ గత చిత్రాలను మించి లాజిక్ లెస్ గా ఉందని టాక్ వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఈ మూవీ పై నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి ఇంట్లోకి ఎంటర్ అవ్వడమే చాలా కష్టం. అట్లాంటిది, తెలంగాణలోని ఒక పల్లెటూరి సాధారణ కుర్రాడు, ముఖ్యమంత్రి ఇంటికి ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని కొట్టి, సీఎం ఇంట్లోకి వెళ్లిపోవడం. ఆ తరువాత హీరో ముఖ్యమంత్రి కూతుళ్లను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తాడు. ఈ సన్నివేశం తీసేటపుడు చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “స్కంద” సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..? ఒకవేళ సినిమా చేసి ఉంటే..?
End of Article