ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా స్కంద. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.

Video Advertisement

ఈ మూవీలో హీరో రామ్ డిఫరెంట్ లుక్ లో నటించి, మెప్పించారు. రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు . స్కంద మూవీ ఒక వర్గం ఆడియెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ మూవీలో హీరోగా ముందుగా రామ్ ను అనుకోలేదట. స్కందను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన సినిమా స్కంద. తాజాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. బోయపాటి మూవీ అంటేనే భారీ యాక్షన్, అదిరిపోయే మాస్ డైలాగులు, ఎమోషన్, గాలిలోకి ఎగిరే ఫైట్స్ ఉంటాయి.
ఇక ఈ మూవీ ఊరమాస్ గా తెరకెక్కించారు. లవర్ బాయ్ గుర్తింపు ఉన్న రామ్ స్కందలో ఊరమాస్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోగా బోయపాటి రామ్ ను అనుకోలేదట. తెలుగు స్టార్ హీరోను ఊహించుకుని స్కంద కథను రాశారట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు అని టాక్ నడుస్తోంది. స్కంద స్టోరీ మొత్తం చెప్పాక మహేష్ ఈ మూవీ చేయలేనని చెప్పారట.
ఈ స్టోరీ తనకు సెట్ అవ్వదని, సున్నితంగా రిజెక్ట్ చేసారంట. ఇంత ఊర మాస్ గా ఫ్యాన్స్ తనను చూడలేరని చెప్పారట. అలా మహేష్ బాబు స్కందను సున్నితంగా తిరస్కరించారని టాక్. మరొక టాక్ ప్రకారం బోయపాటి స్కంద రాసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అని, అల్లు అర్జున్ ఈ మూవీని రిజెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: హీరో అవుతాడనుకున్న ఆ యాక్టర్ కొడుకు.. మంచానికే పరిమితం అయ్యాడు..! అసలు ఏం జరిగిందంటే..?