Ads
ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాల్లో ఒకటి ఉప్పెన. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించగా పంజా వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. వీరిద్దరికీ ఇది మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అని ప్రేక్షకులు అభినందించారు.
Video Advertisement
ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఉప్పెన సినిమాని ప్రశంసించారు. ఉప్పెన సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మేజర్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా 2000 సంవత్సరం మొదట్లో జరిగిన కథగా చూపిస్తారు. ఇందులో నటీనటుల దుస్తులు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే ఉంటాయి.
అందులోనూ ముఖ్యంగా హీరో దుస్తులు అయితే చాలా సాధారణంగా ఉంటాయి. సినిమా చూసిన వాళ్లకి వాళ్ల డ్రస్ లు డిజైన్ చేయడానికి అంత పెద్ద సమయం ఏమీ పట్టకపోయి ఉండొచ్చు. ముఖ్యంగా హీరో డ్రెస్ లు అయితే చాలా సులభంగా దొరుకుతాయి. ఎందుకంటే రెడీమేడ్ దుస్తులు ఉంటాయి కాబట్టి వాటిని తీసుకెళ్ళి డైరెక్ట్ గా వాడుతారు అని అనుకుంటారు.
కానీ ఈ సినిమా కోసం మాత్రం డిజైనర్ ప్రసన్న దంతులూరి చాలా కష్టపడ్డారు. అందులోనూ ముఖ్యంగా హీరో దుస్తులకు అయితే చీర తీసుకొచ్చి కట్ చేసి దాన్ని షర్ట్ గా కుట్టారు. హీరో వేసుకున్న షర్ట్స్ అన్నీ అలా చీరలతోనే తయారుచేసినవి. మనకి చూడటానికి చాలా సులభంగా కనిపిస్తుంది కానీ ఒక సినిమాలో చూపించే ప్రతి చిన్న విషయం వెనుక చాలా కష్టం ఉంటుంది. అందులో కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా మినహాయింపు ఏమీ కాదు.
End of Article