“క్యాష్” ప్రోగ్రాంలో కనిపించే స్టూడెంట్స్ అంతా అబద్దమా..? వెనక ఇంత కథ నడుస్తుందా..?

“క్యాష్” ప్రోగ్రాంలో కనిపించే స్టూడెంట్స్ అంతా అబద్దమా..? వెనక ఇంత కథ నడుస్తుందా..?

by Anudeep

Ads

తెలుగు బుల్లితెరపై ఎన్నో చానల్స్ ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉన్నాయి.ఇలా బుల్లితెరపై ఈటీవీలో ఎన్నో సీరియల్స్ తో పాటు పలు రియాలిటీ షోలు కూడా ప్రసారమవుతు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

Video Advertisement

 

మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలలో అత్యధికంగా వారికి లాభాలు తెచ్చిపెడుతున్న కార్యక్రమం మాత్రం క్యాష్ కార్యక్రమం అని చెప్పాలి.సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా మల్లెమాలవారు ఎంతో లాభాలను పొందుతున్నారు.

secrets behind suma cash show..!!
సుమ వ్యాఖ్యాతగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తూ ఉన్నారు.సుమ ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో పెద్ద ఎత్తున టాస్కులను నిర్వహిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.

secrets behind suma cash show..!!
ఈ కార్యక్రమంలో భాగంగా ఓ రౌండ్ లో కాలేజీ విద్యార్థులను ఆహ్వానించి వారి పై కూడా సుమ పంచులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులుగా సందడి చేసే వారంతా నిజంగానే కాలేజీ విద్యార్థులు కాదని వాళ్ళందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులేనని తెలుస్తోంది.ఈ రౌండ్లో సుమ కొంతమందిని మాత్రమే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అయితే ఈ షో ప్రారంభానికి ముందు స్క్రిప్ట్ ఇచ్చి వారిని సిద్ధం చేస్తుంటారనే వార్త వైరల్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు.

secrets behind suma cash show..!!
అంతే కాకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రైజ్ మనీ గెల్చుకున్న వారికి నిజంగా అంత డబ్బు ఇవ్వరని.. కేవలం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి పేమెంట్ మాత్రమే ఇస్తారని తెలుస్తుంది. ఇక సినిమా ప్రమోషన్ల కోసం ఈ కార్యక్రమానికి వచ్చే సెలబ్రిటీలు వారే మల్లెమాల వరకు డబ్బు చెల్లించి వస్తారని సమాచారం. ఎంతో మంది అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ అంటే మల్లెమాలవారు ఇన్ని రోజులు ప్రేక్షకులను ఇంత మోసం చేస్తూ వచ్చారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like