Ads
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. క్రౌడ్ పుల్లింగ్ చేయగల కెపాసిటీ ఉన్న మాస్ హీరో. ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్నారు. 2001లో నిన్ను చూడాలని మూవీతో టాలీవుడ్లో అరంగేట్రం చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1తో బ్రేక్ అందుకున్నారు. అంతకుముందు బాలనటుడిగా బాల రామాయణం శ్రీరామచంద్రుడి పాత్రలో మెరుపులు మెరిపించారు.
Video Advertisement
టాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. కథ ల ఎంపికలో పర్ఫెక్ట్ గా ఉండే ఎన్టీఆర్ టెంపర్ చిత్రం నుంచి మరింత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ ఉన్నారు.
కథలు, పాత్రల విషయం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకొనే ఎన్టీఆర్ పాత్రలు నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..
# 1 సింహాద్రి
సింహాద్రి చిత్రం లో ఎన్టీఆర్ లాగా ప్రతి ఒక్కరు తమని నమ్మిన వారికి నిజాయితీగా, నమ్మకం గా ఉండాలి.
#2 ఆది కేశవ రెడ్డి
ఆది చిత్రం లో ఎన్టీఆర్ ఎన్ని అడ్డాకుల ఎదురైనా తన లక్ష్యాలను ఎలా చేరుకున్నాడో మనం కూడా అలాగే శ్రమించాలి.
#3 రాఖీ
తోబుట్టువుల కోసం ఎల్లప్పుడూ పోరాడుతూ వారిని సంతోషం గా ఉంచాలని రాఖీ సినిమాలో ఎన్టీఆర్ మనకు చూపించారు.
#4 దయ
టెంపర్ చిత్రం ఎన్టీఆర్ పోషించిన పాత్ర దయ. ఈ చిత్రం లో మొదట్లో చాల తప్పుడ్లు చేసిన దయ చివరికి తన తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దడం కోసం తన ప్రాణాలను సైతం పణం గా పెడతారు.
#5 జై
జై లవ కుశ చిత్రం లో త్రిపాత్రాభినయం చేసారు ఎన్టీఆర్. ఇందులో చెడుని ఎప్పుడు చెడుతోనే పోరాడాలని చూపించారు ఎన్టీఆర్.. అందే సమయం లో తోబుట్టువులను క్షమించి బంధాలు కలుపుకోవాలని కూడా నిరూపించారు.
#6 అభిరాం
జీవితం లో అనుకున్నది సాధించే వరకు వెనుకడుగు వెయ్యడు అభిరాం. అలాగే చివరి ఘడియల్లో ఉన్న తన తండ్రిపై అతనికి ఉన్న ప్రేమ అవాజ్యమైనది.
#7 రాఘవ
అరవింద సామెత వీర రాఘవ చిత్రం లో హింస వల్ల తనకు ఎంత నష్టం జరిగినా శాంతినే కోరుకున్నాడు రాఘవ.
#8 భీమ్
ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో భీమ్ గా నటించి మనల్ని మెప్పించిన ఎన్టీఆర్.. ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉండాలని చూపించారు. అదే సమయం లో స్నేహానికి కూడా అంతే విలువ ఇవ్వాలని చూపించారు.
End of Article