సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా 2013 లో విడుదల అయింది. వెంకటేష్, మహేష్ బాబు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.

Video Advertisement

చిన్నోడు పెద్దోడు అంటూ మహేష్ బాబు వెంకటేష్ మధ్య ఉండే సీన్స్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. అలానే చాలా మంది ఎంతో గొప్పగా నటించి సినిమాకి మంచి పేరు తెచ్చారు.

దర్శకులు తెర మీదకి సినిమాని తీసుకువచ్చిన తర్వాత కొన్ని తప్పులని ప్రేక్షకులను కనిపెడుతూ ఉంటారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా ఒక తప్పు వుంది. మరి మీరు ఆ తప్పుని కనిపెట్టారా…? దాని కోసమే ఇప్పుడు మనం చూసేద్దాం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే అంజలి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. అయితే అంజలి నిద్రపోయి ఉంటుంది. జయసుధ పని మనిషి తో మాట్లాడి లోపలికి వచ్చిన తర్వాత అంజలి దుప్పటి కప్పుకుని పడుక్కుని ఉంటుంది.

జయసుధ ముగ్గు నేను వేస్తే మళ్లీ నా ముగ్గే బాగుందని అంటావు నిద్రలే అని అంజలితో చెప్తారు. అయితే అంజలి దుప్పటి తీసేసరికి ఆమె తయారయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఆమె లేచేటప్పుడు భూదేవికి దండం పెట్టుకుని కిందకి దిగుతుంది.

పైగా భూమాత నేను పెట్టే ప్రతి అడుగు అడుగులా కాకుండా ముద్దులా తీసుకో అని చెప్పి అంజలి నిద్రలేస్తుంది. ముందు నేను ఎప్పుడో రెడీ అయ్యానని చెప్తుంది అంజలి. కానీ ఆ తరవాత మాత్రం భూదేవికి దండం పెట్టుకుంటుంది. తను అప్పుడే ఫస్ట్ టైం బెడ్ దిగుతుంటే మరి ఎప్పుడో ఎలా తయారైపోతుంది..? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో డైరెక్టర్ పొరపాటు చేశారు చాలామంది దీన్ని గమనించే ఉంటారు.