Ads
సినిమావాళ్ళ జీవితాలు తెరపై ఉన్నట్లే రంగుల మయం గా ఉంటాయి అణులుంటారు అందరూ. కానీ వారి జీవితాల్లో కూడా ఎన్నో వ్యధలు ఉంటాయి. నటులుగా పని చేసినంత కాలం వెలుగు వెలిగిన వారు.. అవకాశాలు తగ్గాక పూట గడవని స్థాయిలో వాటి జీవితాలు ఉంటాయి. ఆలా దయనీయ స్థితి లో ఉన్న సీనియర్ నటులను మనం చాల మందిని చూసాం.. ఇప్పుడు వారిలాగే మరో సీనియర్ నటి కూడా ఉన్నారు. ఆవిడే సీనియర్ కేరెక్టర్ ఆర్టిస్ట్ ఝాన్సీ.
Video Advertisement
పెళ్లి పుస్తకం, మనవూరి పాండవులు, యమగోల వంటి 300 కి పైగా చిత్రాల్లో నటించారామె. అయితే సినిమాల్లో నటించిన డబ్బుతో కొన్ని సినిమాలు నిర్మించి ఉన్నదంతా కోల్పోయారు సీనియర్ నటి ఝాన్సీ. ” 30 ఏళ్ళ క్రితం మేము చెన్నై లో ఉండేవాళ్ళం, ఇండస్ట్రీ హైదరాబాద్ కి రావడం తో మేము కూడా ఇక్కడికి వచ్చేసాం.. కానీ నాకు అప్పటి నుంచి అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడు మా వారు సొంత బ్యానర్ ఏర్పాటు చేసి సుమన్ తో ‘ ఖైదీ ఇన్స్పెక్టర్’ చిత్రం తీసాం. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాగానే ఆడింది కానీ.. డబ్బులు మా వరకు రాలేదు.
ఆ తర్వాత అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆస్తులన్నీ పోయాయి. దానికి నేనేమి బాధ పడలేదు. కానీ నా భర్త మరణించిన తర్వాత న కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ వారు నన్ను ఒక్కదాన్నే వదిలేసి కోడళ్లతో వెళ్లిపోయారు. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది కానీ రోజులు అలాగే నెట్టుకొస్తున్నాను.” అని ఆమె చెప్పుకొచ్చారు.
సావిత్రి గారి లాగే ఒక వెలుగు వెలిగి ఆఖరి రోజుల్లో కష్టాలు పడుతున్న సీనియర్ నటులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం మూవీ అసోసియేషన్స్ కి ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమె గురించి తెలుసుకున్న నెటిజన్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆమెను ఆదుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
End of Article