Ads
సీనియర్ నటి తులసి బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. శంకరాభరణం సినిమాలో మంజుల కొడుకుగా.. శంకర శాస్త్రి శిష్యుడిగా తులసి నటన ఇప్పటికీ సినీ అభిమానుల మనసులో ముద్రించుకుంది. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినా కాలక్రమంలో చెల్లెలు, అక్క, వదిన, అమ్మ వంటి క్యారెక్టర్లకు షిప్ట్ అయ్యింది. ఏ పాత్ర అయినా సినీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది.
Video Advertisement
మూడు నెలల పాప గా ఉన్నప్పుడు భార్య అనే చిత్రంలో ఓ పాపగా తెరంగేట్రం చేసింది తులసి. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మగపిల్లాడి పాత్రలో దాదాపుగా వంద చిత్రాల్లో ఆమె నటించారు. అయితే తాజాగా ఆమె తన వివాహం, తన భర్త వివరాలు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.
ఈమె తన 28వ ఏట కన్నడ డైరెక్టర్ శివమణిని వివాహం చేసుకుంది. ఒకే రోజులో అతన్ని చూడడం, ప్రేమించడం, సాయంత్రానికి పెళ్లి చేసుకోవడం జరిగిపోయిందట. “‘1995 లో ‘మదర్ ఇండియా’ మూవీలో నటించడానికి చెన్నై వెళ్ళాను. అప్పుడు కన్నడ దర్శకుడు శివమణితో పరిచయం ఏర్పడింది. శివమణిని షూటింగ్ లో చూసినప్పుడు నాకు ప్రేమ ఫీలింగ్ కలిగింది. అయితే పెళ్లి చేసుకుందాం అని అడిగింది మాత్రం నేను కాదు శివమణినే..! అదే నాకు ఆశ్చర్యం కలిగించింది. దాంతో ఆరోజు సాయంత్రమే గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమ..పెళ్లి కేవలం ఒక్కరోజులోనే జరిగిపోవడం ఎప్పటికీ ఓ మెమొరబుల్ మూమెంట్.” అని తులసి చెప్పారు.
కానీ తన పెళ్లి అయ్యేటప్పటికి తన భర్త చాలా పేదవారని, తన అత్తగారు పాచి పని చేసేదని.. తను కోడలిగా అడుగుపెట్టాకే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగయ్యిందని తులసి చెప్పుకొచ్చింది. ఆయన తీసిన కొన్ని సినిమాలు ఫెయిల్ కావడంతో.. వారి ఆర్థిక పరిస్థితి అంతలా దిగజారింది. అప్పలుపాలయ్యారు అని ఆమె వెల్లడించారు.
అయితే పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె ఆ తర్వాత 3 కన్నడ చిత్రాల్లో మదర్ పాత్రలను చేసింది.ఇకపోతే ఆమె చేసిన ఆ మూడు సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. కాగా ఆ తర్వాత తమిళంలో కూడా సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించింది. తెలుగు లో డార్లింగ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తులసి పలు సహాయక పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. అయితే ఆమె కొడుకు సాయి తరుణ్ ని కూడా హీరో చేయాలని భావిస్తోంది.
End of Article