“నా భర్తని కరెంట్ వైర్లతో కాల్చి చంపేశారు.. ఆ హీరోయినే ఇలా చేయించింది” అంటూ సీనియర్ నటి కృష్ణవేణి షాకింగ్ కామెంట్స్..

“నా భర్తని కరెంట్ వైర్లతో కాల్చి చంపేశారు.. ఆ హీరోయినే ఇలా చేయించింది” అంటూ సీనియర్ నటి కృష్ణవేణి షాకింగ్ కామెంట్స్..

by Anudeep

Ads

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం అని అనుకుంటూ ఉంటారు. కానీ.. అందులో కూడా పైకి కనిపించని విషాదాలు ఎన్నో ఉంటాయి. వాటిని భరిస్తూనే.. నటులు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. తాజాగా.. సీనియర్ నటి కృష్ణవేణి ఇంటర్వ్యూ చూస్తే నటుల జీవితాల్లో ఇన్ని బాధలుంటాయా అని అనిపించక మానదు.

Video Advertisement

ప్రస్తుతం బామ్మ తరహా పాత్రలలో అలరిస్తున్న కృష్ణవేణి చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీకి వచ్చారు. తొలుత ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

krishnaveni 1

బతుకుతెరువు కోసం చాలా కష్టపడ్డా కృష్ణవేణి కెరీర్ లో ఆమెను వెనక్కి లాగడానికి చాలా మంది ప్రయత్నించారట. ఆమె రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించగా.. వాటిలో ఒకటి రిలీజ్ కాకుండా కొందరు అడ్డుకున్నారు. మరొక సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్నా.. దాన్ని కూడా ఫ్లాప్ కింద జమకట్టించారు. దీనితో మంచి ప్రతిభతో పాటు అందగత్తె అయినా కూడా కృష్ణవేణి హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయారు.

krishnaveni 3

తననే కాదు.. తన భర్తని కూడా ఈ ఇండస్ట్రీ తొక్కేసిందని కృష్ణవేణి ఆవేదన చెందారు. టైం ఎప్పుడు ఒకేలా ఉండదని.. ఒక్కోసారి ఒక్కో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె జీవితం నేర్పింది. టైం బ్యాడ్ అయిన రోజుల్లో ఆమె ఒకసారి అమెరికాలో ఓ 90 ఏళ్ల వ్యక్తి ఇంట్లో పని మనిషిగా కూడా పని చేయాల్సి వచ్చింది. అంతే కాదు తన భర్తకి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు.

krishnaveni 2

కృష్ణవేణి ‘వారాలబ్బాయి’ డైరెక్టర్‌ రాజచంద్రను పెళ్లి చేసుకున్నారు. తనకు నలుపు నచ్చకపోయినా.. నల్లగా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని.. కానీ, పెళ్లి అయ్యాక మేమిద్దరం బాగానే ఉన్నామని అన్నారు. ఆయన చాలా మంచివారు అని.. అప్పుడప్పుడే హిట్ సినిమాలు పడుతున్న టైములో కెరీర్ లో నన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నించేవారు కూడా ఉన్నారని తెలిసిందన్నారు. లైఫ్ లో సెటిల్ అవుతాం అనుకునే టైములో ఇండస్ట్రీ వాళ్ళే ఆయన్ని హత్య చేయించారన్నారు. ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరోయిన్ ఇలా చేయించిందని.. కరెంట్ వైర్లతో కాల్చి.. పీక పిసికి చంపేశారని… ఈ విషయం పోలీసులకు కూడా తెలుసనీ.. కానీ, ఏమి చేయలేమని చేతులెత్తేశారని కృష్ణవేణి కంటతడి పెట్టుకున్నారు. ఇలా జరిగిన కొన్నేళ్ళకే ఆ హీరోయిన్ కూడా చనిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.

Watch Video:

 


End of Article

You may also like