బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ ను అవమానించారా.? ఎన్టీఆర్ తెరవెనక కష్టాల గురించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్.!

బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ ను అవమానించారా.? ఎన్టీఆర్ తెరవెనక కష్టాల గురించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్.!

by Sunku Sravan

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో. తన జీవితంలో నిలదొక్కుకోవడానికి ఒక యుద్ధమే చేశారని చెప్పవచ్చు. ఈ విధంగా ఆయన ఎంతో కష్టపడి చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ లోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కార్యకర్తలు నాయకులు అంటుంటారు.

Video Advertisement

ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ వరుసగా 6 విజయాలను సొంతం చేసుకోవడంతో మూవీ, మూవీ కి ఆయన పారితోషికం పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మనకు తెలియని కొన్ని విషయాలను తెలియజేశారు అవేంటో చూద్దాం..! జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అవుతున్నది.

ఎన్టీఆర్ బాల రామాయణం మూవీ తర్వాత విజయవాడలో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను సినిమా ఫీల్డ్ లోనే ఉండాలి అనుకుంటున్నాను. ఫీల్డ్ లో నా సినిమాలు ఫ్లాప్ అయినా సరే చివరికి ఇండస్ట్రీలో లైట్ బాయ్ గా అయినా పని చేస్తానని చెప్పారు. అయితే ఎన్టీఆర్ ను మొదటిసారిగా విశ్వామిత్ర సినిమా ద్వారా సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను బాల భరతుడు పాత్రలతో సినిమాల్లోకి తీసుకు వచ్చారు.

ఈ విధంగా ఎన్టీఆర్ ను సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తీసుకున్నారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ కి పూర్తిగా దూరమయ్యారు. చివరికి బాలకృష్ణ కూతురు ఎంగేజ్ మెంట్ కు కూడా వీరిని లోపలికి రానివ్వలేదు అంటే ఏ విధంగా అవయిడు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆనాటి నుంచి ఎన్టీఆర్ నేను ఒక పెద్ద సక్సెస్ సాధించి ఆ కుటుంబాన్ని నావైపు తిప్పుకోవాలనేది ఆయన ఒక యుద్ధంగా భావించారు.

చాలా చిన్న వయసులోనే మొదలుపెట్టి ఆ సమయంలో పెద్ద పెద్ద హీరోలతో పోటీపడుతూ నెగ్గుకుంటు వచ్చారు ఎన్టీఆర్. ఈ రోజున బాలకృష్ణ, హరికృష్ణ గారు చనిపోయిన పర్వాలేదు కానీ ఎన్టీఆర్ నేనున్నానని మాట్లాడడు. ఈ విధంగా ఎన్టీఆర్ తనకుతానే కష్టపడి ఒక యుద్ధాన్ని గెలిచారని చెప్పవచ్చు.

ఈ విధంగా ఇండస్ట్రీలో యుద్ధం చేశారు జీవితంలో యుద్ధం చేశారు ఎన్టీఆర్. అందుకే మిగిలిన హీరోలందరితో పోలిస్తే ఎన్టీఆర్ వ్యక్తిత్వం కానీ ఆయన కష్టపడి సాధించిన విజయాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో జీవితం తెలిసిన హీరో ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.

watch video:

 


You may also like

Leave a Comment