Ads
మన జీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మనకి సెంటిమెంట్ లను కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకి ఏదైనా డేట్ లేదా కలర్ కలిసి వచ్చినప్పుడు..మళ్ళీ మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు తిరిగి అలాంటి నెంబర్, కలర్ కలిసి వచ్చేలా చూసుకుంటాం. వాటివలన మనకి సక్సెస్ వస్తుందని నమ్ముతాం.. లక్కీ గా, మనం మన సెంటిమెంట్ ని ఫాలో అయినప్పుడల్లా మనకి సక్సెస్ వస్తూనే ఉంటుంది. సో అలా మొదలైన సెంటిమెంట్ మన లైఫ్ లో కంటిన్యూ చేస్తూనే ఉంటాం.. అలాంటి సెంటిమెంట్లే మన టాలీవుడ్ సెలెబ్రెటీలకు కూడా ఉన్నాయండోయ్. అవేంటో చూసేద్దామా మరి..
Video Advertisement
1. పూరి జగన్నాధ్
దర్శకుడు పూరి జగన్నాధ్ కి బ్యాంకాక్ సెంటిమెంట్ ఉందట. సినిమా ఏదైనా, స్క్రిప్ట్ మాత్రం బ్యాంకాక్ లోనే రాస్తారు. అక్కడ కూర్చుని స్క్రిప్ట్ రాస్తే సినిమా పక్కా హిట్ అవుతుందని నమ్ముతారు.
2. మెగాస్టార్ చిరు
మెగాస్టార్ చిరంజీవి కి తన సినిమా లో కనీసం ఒక్క సీన్ అయినా వైట్ షర్ట్ తో ఉండేలా ప్లాన్ చేస్తారట. ఇంద్ర సినిమా చూసాం కదా.. ఆల్మోస్ట్ సగం సినిమా వైట్ షర్ట్ లోనే చిరు కనిపిస్తారు.ఆ సినిమా మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.
3. సూపర్ స్టార్ మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు కు చాలానే సెంటిమెంట్లు ఉన్నాయి. మహేష్ షూటింగ్ కోసం ఎప్పుడు ముంబై కి వెళ్లినా, మారియట్ హోటల్ లోనే ఉంటారు. అది లక్కీ గా ఫీల్ అవుతారు. అలాగే, ప్రతి సినిమా రిలీజ్ కి ముందు కడప లో అమీన్ పీర్ దర్గా కి వెళ్తారట. అలాగే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉండే సుదర్శన్ థియేటర్ ని మహేష్ బాబు లక్కీ థియేటర్ గా ఫీల్ అవుతారు. మహేష్ బాబు ప్రతి సినిమా ఈ థియేటర్ లో పక్కా రిలీజ్ అవుతుంది.
4. కాజల్ అగర్వాల్
మగధీర సినిమా సక్సెస్ అయినప్పటి నుంచి కాజల్ అగర్వాల్ తన సినిమా లో తన ఓపెనింగ్ సీన్ ఎప్పుడు వైట్ డ్రెస్ లో నే ఉండేలా చూసుకుంటారు. అలా ఉంటె, తన సినిమా పక్కా హిట్ అవుతుందని నమ్ముతారు.
5. రాజమౌళి &రాఘవేంద్ర రావు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, జక్కన్న ఇద్దరికి ఒకటే సెంటిమెంట్ ఉందట. సినిమా షూటింగ్ మొదలయ్యాక, తిరిగి పూర్తి అయ్యే వరకు గడ్డం షేవ్ చేయరట.
6. త్రిష
త్రిష తన ప్రతి సినిమా లో డ్రింకింగ్ సీన్ ఉండేలా చూస్తారు. అలా ఉంటె.. ఆ సినిమా పక్కా హిట్ అవుతుందని నమ్ముతారు. అలాగే, త్రిష సినిమా లో రైన్ సీన్ లేదా సాంగ్ ఉన్నా కూడా ఆ సినిమా హిట్ అవుతుందని డైరెక్టర్లు నమ్ముతారు.
7. నయనతార
నయనతార లక్కీ నెంబర్ 5 ట. అందుకే ఆమె తన ప్రతి సినిమా షూటింగ్ ఐదవ తేదీ మొదలయ్యేలా చూసుకుంటారు. అలాగే, ఫస్ట్ అడ్వాన్స్ కూడా 5 డిజిట్ నెంబర్ తో తీసుకుంటారట.
9. అల్లు అర్జున్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఒక సెంటిమెంట్ ఉందట. అదేంటంటే, తన సినిమా లో కచ్చితం గా వైజాగ్ లో షూట్ ఉండేలా చూసుకుంటారు. గంగోత్రి నుంచి జులాయి వంటి సినిమాలలో వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి.
10. ఇలియానా
ఇలియానా కి ఇది సెంటిమెంట్ కాకపోయినా, ఇలియానా తో సినిమా చేసే డైరెక్టర్లు అందరు కనీసం ఒక్క బీచ్ సాంగ్ అయినా ఉండేలా చూస్తారు. అలా ఉంటె, ఆ సినిమా హిట్ అవుతుందని డైరెక్టర్లు నమ్ముతుంటారు.
11. రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ కి 1 అండ్ 3 లక్కీ నంబర్స్ అట. నుమెరాజికల్ గా వన్ అండ్ త్రి వచ్చే డేట్స్ తోనే రకుల్ షూట్ కి అటెండ్ అవుతారట. అలాగే 8వ నెంబర్ ని అవాయిడ్ చేస్తారట. అలాగే ఏదైనా సినిమా లో రకుల్ తో లిప్ లాక్ సీన్ ఉంటె ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనేది మేకర్స్ సెంటిమెంట్.
12. లావణ్య త్రిపాఠి
హీరోయిన్ లావణ్య కి బ్లాక్ కలర్ సెంటిమెంట్ ఉందట. ఏదైనా సినిమా కి ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు బ్లాక్ డ్రెస్, అండ్ బ్లాక్ కలర్ లో ఉండేవి అన్ని అవాయిడ్ చేస్తారట.
13. రామ్ చరణ్ అండ్ సాయి ధరమ్ తేజ్
మెగా హీరోలు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ లకు ఒక కామన్ సెంటిమెంట్ ఏంటంటే చిరు మూవీ నుంచి ఏదైనా ఒక రీమేక్ సాంగ్. రీమేక్ సాంగ్ ఉంది అంటే ఆ సినిమా పక్కా హిట్ అవుతుందని నమ్ముతారు.
End of Article